మనలో చాలా మంది కొన్ని అవసరాలకు గాను ప్రభుత్వ అధికారుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు పొందుతుంటారు. అందుకు కొన్ని నియమ నిబంధనలతోపాటు నిర్దిష్ట ప్రక్రియ కూడా ఉంటుంది. కానీ.. ఇటీవల కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం జారీ అయిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. అయితే తాజాగా అదే బీహార్ రాష్ట్రం నవాడా జిల్లా సిర్దాల బ్లాక్‌లోని ఆర్టీపీఎస్ కార్యాలయానికి ‘డాగేష్ బాబు’ అనే పేరున్న మరో కుక్క…
ప్రస్తుతం రీల్స్ కు ఎంత క్రేజ్ ఉందంటే.. వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. లైక్ లు, వ్యూస్ కోసం ఆరాటపడుతున్నారు. పక్కనొళ్లు ఏమైనా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న పర్వాలేదు.. వీళ్లు మాత్రం రీల్ చేస్తుంటారు. అలాంటి ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. భర్త హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. భార్య మాత్రం రీల్ చేస్తోంది.
F-35B Fighter Jet: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత అడ్వాన్సుడ్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఎఫ్-35బీ ఫైటర్ జెట్, సాంకేతికత కారణాలతో కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో దిగింది. అయితే, అప్పటి నుంచి దీని సాంకేతిక సమస్యలు దూరం కాలేదు. దీంతో గత మూడు వారాలుగా ఎయిర్‌పోర్టులోనే ఉంది. చివరకు 24 మంది నిపుణులు దీనిని రిపేర్ చేయడానికి భారత్ రావాల్సి వచ్చింది. మరమ్మతుల కోసం ఎయిర్‌పోర్టులోని హ్యాంగర్‌కి తరలించారు.