Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
- యోగా కార్యక్రమంలో వైరల్ అయిన రవి కిషన్ వీడియో
- 'గుట్కాసన్' అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్
- గుట్కా కాదు.. వాము లేదా యాలకులే కావచ్చంటూ అభిమానుల కౌంటర్
- వీధి నాటకాల నుంచి ఎంపీ వరకు రవి కిషన్ ప్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Kishan : ‘రేసుగుర్రం’ సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’గా తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నటుడు రవి కిషన్. భోజపురి సూపర్ స్టార్ అయిన ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుండి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచి చక్రం తిప్పుతున్నారు. అయితే, తాజాగా ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్న వీడియో ఇప్పుడు నెట్ ఇంట పెద్ద దుమారమే రేపుతోంది.
బాడీకే కాదు.. నోటికి కూడా ఎక్సర్సైజ్
ఈ యోగా కార్యక్రమంలో రవి కిషన్ ఆసనాలు వేస్తూనే, నోట్లో ఏదో వేసుకుని నములుతూ కెమెరా కంటికి చిక్కారు. దాంతో నెటిజన్లు ఊరుకుంటారా.. ఆయనపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన నములుతోంది పక్కాగా ‘గుట్కా’ లేదా ‘ఖైనీ’ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. “యోగా చేసేటప్పుడు కేవలం శరీరానికి మాత్రమే ఎక్సర్సైజ్ ఇస్తే సరిపోతుందా? నోటికి కూడా కావాలి కదా” అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మరికొందరైతే ఆయన వేసిన ఆసనానికి ‘గుట్కాసన్’ అని పేరు పెట్టి జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నేషనల్ వైడ్‌గా తెగ వైరల్ అవుతోంది.
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
రవి కిషన్‌పై ఈ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుండటంతో ఆయన ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. నోట్లో ఏదో నమిలినంత మాత్రాన అది గుట్కానే అని ఎలా చెప్తారు? గొంతు బాగుండటానికి లేదా ఆరోగ్యం కోసం వాడే వాము (అజ్వైన్), యాలకులు, లవంగాలు కూడా కావచ్చు కదా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా ఒక పాపులర్ యాక్టర్, పైగా బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా యోగా చేస్తూ దొరికిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వీధి నాటకాల నుండి పార్లమెంట్ వరకు..
రవి కిషన్ సినీ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. కెరీర్ మొదట్లో ఆయన వీధి నాటకాల్లో సీత పాత్రలు వేసేవారు. అయితే పౌరోహిత్యం చేసుకునే సాంప్రదాయ కుటుంబం కావడం వల్ల, కొడుకు నటన వైపు వెళ్లడం ఇష్టం లేక తండ్రి ఆయన్ను విపరీతంగా కొట్టేవారట. కొడుకు పడే కష్టాలు చూడలేక వాళ్ల అమ్మ రూ.500 చేతిలో పెట్టి ముంబై పంపించేసింది. ముంబైలో అడుగుపెట్టిన రవి కిషన్ మొదట్లో చిన్న చిన్న బాలీవుడ్ పాత్రలు చేస్తూ, ఆ తర్వాత భోజపురి సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఎంపీగా రాణిస్తూ ఇలా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!