సాధారణంగా ప్రతి మనిషికి మతిమరుపు ఉంటుంది.. బిజీ వర్క్ లోనో.. లేక వేరే ఏదో ఆలోచనలోనో కొన్నింటిని మర్చిపోతుంటారు. ఇక వయస్సు పెరిగేకొద్దీ అల్జీమర్స్ రావడం సహజమే.. ఇంట్లో వారిని మర్చిపోవడం.. బయటికి వెళ్లితే ఇల్లు ఎక్కడ ఉందో కూడా మర్చిపోతుంటారు పెద్దవాళ్ళు.. ఇక్కడి వరకు మనకు తెలిసినవే.. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇంతకంటే కొద్దిగా ఎక్కువగానే మతిమరుపుతో బాధపడుతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం మర్చిపోతున్నాడో తెలుసా.. శృంగారాన్ని.. ఏంటీ శృంగారం చేయడం మర్చిపోతున్నాడా..? అంటే శృంగారం చేస్తున్నాడు.. కానీ చేసిన పది నిమిషాలకే తాను ఏమి చేశాడో మర్చిపోతున్నాడు. రోజూ భార్యతో శృంగారం చేయడం.. చేసిన పది నిమిషాలకే అస్సలు నేను శృంగారంలో పాల్గొన్నానా అని అడగడం.. తాను శృంగారం చేసిన వైనాన్ని కూడా గుర్తు పెట్టుకోలేని విచిత్రమైన వ్యాధితో ఆ వ్యక్తి బాధపడుతున్నాడు. అసలు ఆ వ్యాధి పేరేంటి..దానికి పరిష్కారం ఏంటి అనేది చూద్దాం.
ఐర్లాండ్ కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. నిత్యం ఎంతో ఉల్లాసంగా ఉండే అతను గత రెండు రోజుల క్రితం అతడు తన పెళ్లి రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఇక అదే రోజు రాత్రి భార్యతో కలిసి శృంగారంలో పాల్గొన్నాడు. ఇక ఆ శృంగారపు అనుభూతిని పది నిమిషాల్లోనే మర్చిపోయాడు. ఉదయం లేవగానే అదే విషయం భార్యకు చెప్పాడు. ముందు రోజు జరిగిన పెళ్లి రోజు వేడుకలు కూడా గుర్తులేవని చెప్పుకొచ్చాడు. అయ్యో మతిమరుపు వచ్చింది అనుకుంటే పొరపాటే.. మూడేళ్ళ క్రితం వారు ఎక్కడున్నది.. ఏం చేస్తున్నది పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చిన వ్యక్తి భార్యతో శృంగారం చేసిన విషయం, పెళ్లిరోజును మర్చిపోవడం కొంచెం విడ్డురంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే వెంటనే ఆ వ్యక్తిని వైద్యులకు చూపించగా ఆటను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. అత్యంత అరుదుగా ఉండే ఈ కేసు స్టడీని తాజాగా ఐరిష్ మెడికల్ జర్నల్ తీసుకోవడంతో ఈ వ్యాధి ప్రపంచానికి తెలిసింది.
ఏడేళ్ల క్రితం ఒక్కసారి ఇలాగే జరిగిందని, ముందు రోజు జరిగినవిషయాలేమి తనకు గుర్తు లేనట్లు చెప్పుకొచ్చాడని తెలిపారు. దీంతో వైద్యులు అతని కేస్ ను జాగ్రత్తగా స్టడీ చేశారు. సాధారణంగా ఇలాంటి సమస్య స్ట్రోక్ కారణంగా నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కారణమవుతుందని.. అలాంటివేమీ లేకుండా కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శారీరకంగా బాగా శ్రమ పడినా.. అతి చల్లని లేదంటే బాగా వేడి నీళ్లల్లో చాలాసేపు మునిగినా.. భావోద్వేగ ఒత్తికి గురైనా.. అరుదుగా కొన్నిసార్లు సెక్సు చేసినా కూడా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అయితే ఈ వ్యక్తి విషయంలో శృంగారం జరిగిన తరువాత మర్చిపోవడం మాత్రం విశేషమని చెప్తున్నారు. ప్రస్తుతం అతనిని మాత్రం అబ్జర్వేషన్ లో పెట్టినట్లు వైద్యులు తెలుపుతున్నారు.