Site icon NTV Telugu

Pink Coconut : ఇండోనేషియా నుండి మంగళూరుకు పింక్ కలర్ కొబ్బరిబొండం.. నిజమేనా ఈ వైరల్ పోస్ట్..?

Pink Coconut

Pink Coconut

Pink Coconut : వేసవి అంటేనే కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఈ సహజ పానీయం ప్రజల అభిమానంగా నిలుస్తుంది. అయితే తాజాగా మంగళూరులో ఓ వినూత్నమైన కొబ్బరి బొండాం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ రంగులో కాకుండా.. గులాబీ రంగులో ఉండే ఇండోనేషియన్ కొబ్బరి బొండాం అని సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.

Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..!

‘Manglore Information’ అనే ఫేస్‌బుక్ ఖాతా ఈ గులాబీ రంగు ఎళ్లనీరు ఫొటోను పోస్ట్ చేస్తూ, “సియాళ రేటు ఎక్కువైనా మంగళూరుకు బాగా ఫ్యాషన్‌దొరికింది.. ఇండోనేషియా నుండి వచ్చిన పింక్ కోకోనట్ ఇది. ఇది ఎలాంటి పెయింట్ కాదు.. సహజంగానే గులాబీ రంగులో ఉంటుంది” అని పేర్కొంది. అద్భుతంగా కనిపించిన ఈ గులాబీ కోకోనట్ ఫొటో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వైరల్ ఫొటోపై నెటిజన్లు జోకులు వేసేందుకు కూడా వెనుకాడలేదు. “ఇది ఎలా గులాబీగా మారింది?” అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా, మరొకరు “ఇప్పటివరకు తెలుపు పెయింట్ వేశారని చూశాం.. ఇప్పుడు పింక్, తర్వాత బ్లూ వస్తుందేమో” అంటూ సెటైర్లు వేశారు.

మరికొంతమంది “ఇందులోని నీరు కూడా గులాబీ రంగులో ఉందా? లేక శుభ్రంగా తెలుపేనా?” అంటూ నిజం తెలుసుకోవాలన్న ఉత్సుకత వ్యక్తం చేశారు. నిజానికి ఇది సహజమేనా లేక ఆర్టిఫిషియల్ రంగు వేసిందా అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కొబ్బరి బొండాం రంగు పరంగా ఇలా పింక్ కలర్‌లో కనిపించడం అరుదైన విషయం కావడంతో ఇది నిజమేనా? నకిలీనా? అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి.

Google Maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. ఓరి దేవుడా జర్రుంటే సచ్చి పోయేటోళ్లు..

Exit mobile version