Viral : మన దేశం లో ప్రతిభ గలవారికి అస్సలు కొదవే లేదు. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపే తెలివితేటలతో ముందుంటారు. అలాంటిదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో. సాధారణంగా ఉల్లిపాయలు కోస్తే కళ్లలో నీళ్లు వచ్చి చెమర్చిపోతుంది. దీన్ని నివారించేందుకు అనేక చిట్కాలు చుట్టూ తిరిగాయి కానీ.. ఓ తెలివైన మహిళ మాత్రం తానే సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుగొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..
Health Tips: ఈ ఆహారపు అలవాట్లు కిడ్నీల్లో రాళ్లకు కారణం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
ఈ వీడియోలో కనిపించిందేమిటంటే.. ఓ మహిళ తన రెండు కళ్లపై వెడల్పైన సెల్లో టేప్‌ను అతికించుకుంటోంది. మొదట ఈ అతి తెలివైన పని ఎందుకో అర్థం కాకపోయినా, చివర్లో ఉల్లిపాయలు కోస్తూ ఆమె కళ్లలో ఎలాంటి నీళ్లు రాకుండా తళాఖా పని పూర్తిచేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమె తెలివితేటలకు ఫిదా అవుతున్నారు.
AP High Court: వల్లభనేని వంశీ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా..
ఈ వీడియోను @HinduHunDilse అనే ఖాతా షేర్ చేసింది. వీడియో ఇప్పటికే 3.5 లక్షలకుపైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్, కామెంట్లతో నెట్టింట హల్చల్ చేస్తోంది. “ఇదీ మా డిజిటల్ ఇండియా.. ఇప్పుడు దేశం సరికొత్త ఆవిష్కారాల దిశగా పయనిస్తోంది,” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు సరదాగా – “ఈ వీడియో అమెరికా ట్రంప్ కి కనిపిస్తే.. ప్రపంచ యుద్ధం మొదలవుతుంది” అని రాసారు. ఇంకొకరు చమత్కారంగా – “మీరు ఫ్యాన్ ఆన్ చేసి ఉల్లిపాయలు కోస్తే, మిగతావాళ్లే ఏడుస్తారు!” అని కామెంట్ చేశారు. సాధారణంగా కనిపించే సమస్యను కూడా తన తెలివితో సులభంగా పరిష్కరించిన ఈ మహిళ వీడియో ఇప్పుడు ‘ఒక్కో క్లిక్‌కి ఒక పంథా’ అన్నట్టు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..
प्याज़ काटने की ये तकनीक देश से बाहर नहीं जानी चाहिए.. 🤣🤣 pic.twitter.com/JxSsxlwskW
— BITTU SHARMA 4.O (@HinduHunDilse) May 17, 2025