NTV Telugu Site icon

Viral Video: అంతరిక్షంలో బట్టలు ఎలా ధరిస్తారో తెలుసా? ఈ వీడియో చూడండి..

Viral Video

Viral Video

భూమి మీద దుస్తులు వేసుకోవడం చాలా సులభం. కానీ.. అంతరిక్షంలో దుస్తులు ధరించడం ఒక సవాలు. కానీ అనుభవజ్ఙుడైన నాసా వ్యోమగామి డాన్ పెటిట్ అంతరిక్షంలో సులభంగా దుస్తులు ధరించే పద్ధతిని జనాలకు చూపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ బయటపడింది. ఆయన తన ప్యాంటును చాలా ప్రత్యేకమైన రీతిలో ధరించారు. ఈ వీడియో ఫిబ్రవరి 21న షేర్ చేశారు. వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తన డ్రెస్సింగ్ టెక్నిక్‌ను ప్రదర్శించారు. దీనిని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయారు.

READ MORE: SLBC Incident: క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం..

సాధారణంగా.. కాళ్ళను ఒక్కొక్కటిగా పెట్టుకుని ప్యాంటు ధరిస్తారు. కానీ ఆస్ట్రోనాట్ పెటిట్ శైలి పూర్తిగా ప్రత్యేకమైనది. ముందుగా ప్యాంటు గాలిలో ఉంటుంది. ఆయన నెమ్మదిగా ప్యాంటు పైభాగం నుంచి కిందికి వస్తాడు. ఒకేసారి రెండు కాళ్ళతో దానిలోకి పెడతాడు. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, దాని క్యాప్షన్ కూడా చాలా ఫన్నీగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన తర్వాత వినియోగదారులు తమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, దీనిపై చాలా మంది చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇది చాలా సులభంగా ఉంది’ అని ఒక వినియోగదారు రాశారు. మరొక యూజర్ “నేను ఈ స్టంట్‌ను భూమిపై చేయడానికి ప్రయత్నించాను.. కానీ విఫలమయ్యాను.” అని చెప్పాడు. ఇలాంటి ఫన్నీ వ్యాఖ్యలు చాలానే వచ్చాయి.

READ MORE: MK Stalin: ‘‘దక్షిణాదిపై కేంద్రం కత్తి’’.. డీలిమిటేషన్, హిందీపై స్టాలిన్ ఫైర్..

కాగా.. వ్యోమగామి డాన్ పెటిట్ వయస్సు 69 సంవత్సరాలు. 1955లో ఒరెగాన్‌లోని సిల్వర్టన్‌లో జన్మించారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆయన అనుభవజ్ఞుడైన వ్యోమగామి. ఆయనకు నాసాతో చాలా కాలంగా అనుబంధం ఉంది. సోషల్ మీడియాలో కూడా గుర్తింపు పొందారు. పలు మిషన్లలో భాగంగా 370 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. అందుకే ఆయనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇలాంటి విన్యాసాలు చేయడం సులభం.