Site icon NTV Telugu

Monkey Flag Hosting: ఆ వానరం చేసిన పనికి అంతా ఫిదా

Monkey1

Monkey1

ఆగస్టు 15.. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు.. జనమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు. మన స్వాతంత్య్రానికి 75 వసంతాలు పూర్తయ్యాయి. అందుకే మనం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వైభవంగా జరుపుకున్నాం. వాడవాడలా మన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఇంటిపై మన జాతీయ జెండా ఎగిరింది. తెలంగాణలో ఓ ఊర్లో వానరం చేసిన పనికి అంతా ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ వానరం ఏం చేసిందో తెలుసా?

Moneky2

Read Also:Sivaji: అది గోరంట్ల మాధవ్ వీడియో కాదు.. నాదే

మన జాతీయ జెండాను పట్టుకుని చెట్టుపైకి వెళ్లింది. నిర్మల్ జిల్లా బాసర దేవస్థానం వద్ద జాతీయ జెండాను ఎగరవేసిందా వానరం. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్బంగా ఇంటింటికి జెండా ఎగరవేస్తే ఈ వానరం నేను సైతం అన్నట్టుగా మన జెండాను చేబూనింది. దేవస్థానం వద్ద ఆ వానరం జాతీయ జెండాను పట్టుకుని తన వీపుమీద వేసుకోని అందరిని ఆశ్చర్యపర్చింది. చెట్టుపైన కాసేపు అటూ ఇటూ తిరుగుతూ.. ఆలయానికి వచ్చిన భక్తులను ఆశ్చర్యచకితులను చేసిందా వానరం. ఈనెల 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం తెలంగాణలో సక్సెస్ అయింది. లక్షలాదిమంది జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ వానరం కూడా మన జెండాను ఎగరేసి తన దేశభక్తిని ఇలా చాటుకుంది.

Read Also: Swine Flu in Telangana: తెలంగాణపై స్వైన్ ఫ్లూ పంజా విసరబోతోందా?

Exit mobile version