NTV Telugu Site icon

Lovers Romance Viral Video: గట్టిగా హత్తుకుని ముద్దులు.. బైక్‌పైనే లవర్స్ ఘాటు రొమాన్స్! 21 వేల ఫైన్

Couple Romancing On Bike

Couple Romancing On Bike

Lovers Hot Romance on Moving Bike at Ghaziabad Highway: ప్రస్తుత రోజుల్లో పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకోవడం గొప్ప పని అన్నట్లుగా కొంతమంది లవర్స్‌ తెగ ఫీలైపోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో బైక్‌పై ప్రేమాయణం సాగించడం ఓ ట్రెండ్ అయిపొయింది. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికీ చాలానే చక్కర్లు కొట్టాయి. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అయినా అలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ ప్రేమజంట రన్నింగ్ బైక్‌పైనే ఘాటు రొమాన్స్ చేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా ఇందిరాపురం ప్రాంత సమీపంలోని నేషనల్ హైవే 9 (ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే)పై ఓ ప్రేమ జంట రొమాన్స్ చేసింది. యువకుడు బైక్ నడుపుతుండగా.. యువతి పెట్రోల్ ట్యాంకర్ మీద కూర్చుని సదరు యువకుడిని గట్టిగా హత్తుకుంది. అక్కడితో ఆగకుండా చుట్టూ వాహనాలు ఉన్నాయనే సోయి కూడా లేకుండా రొమాన్స్ చేశారు. రోడ్డుపై ఈ ప్రేమ జంట చాలా దూరం వరకూ ఇలానే వెళ్లింది. పక్కన వాహనాలు పోతున్నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు.

Also Read:
Lemon For Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు నిమ్మరసం ఎంతో మేలు.. ఐదు రకాలుగా తీసుకోవచ్చు!
బైక్‌పైనే లవర్స్ చేస్తుండగా.. ఓ కారు డ్రైవర్ వెనుక నుంచి తీసిన వీడియో తీశాడు. సాయంత్రం వేళ చీకట్లో వాహనాల హెడ్‌లైట్ల మధ్య ఈ వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో ఆకాష్ కుమార్ (@Akashkchoudhary) అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేయబడింది. ఈ వీడియోను చూసినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. ఘజియాబాద్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. నంబర్ ప్లేట్ ఆధారంగా వారిని పట్టుకున్నారు. హెల్మెట్ ధరించకపోవడం సహా పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ. 21,000 జరిమానా విధించారు.

Show comments