NTV Telugu Site icon

Viral: సింహంతో ఆటలా..? ఇలాగే ఉంటుంది మరి..!

Zoo

Zoo

సింహం సైలెంట్‌గా ఉందని దాని ముందు కుప్పి గంతులు వేయొద్దు.. దాని కోపం వస్తే ఏమవుతుందో అందరికి తెలుసు.. బోనులో పెట్టినా సింహం మాత్రం పిల్లిగా మారిపోదుగా… అయితే, జూలో ఉన్న సింహాన్ని ఆటపట్టించేవిధంగా తిక్కవేశాలు వేసిన ఓ వ్యక్తికి.. చివరకు చుక్కలు చూపించింది ఆ సింహం.. జమైకా.. సెయింట్​ఎలిజబెత్‌​లోని ఓ జూలో జరిగింది ఈ ఘటన.. జూలోనే పనిచేసే ఓ ఉద్యోగి.. బోనులో ఉన్న సింహాన్ని ఆట పట్టించగా.. కోపంతో ఆ సింహం గర్జించింది.. ఆయినా ఊరుకోకుండా.. బోనులోకి వేళ్లు, చేతులు పెడుతూ ఆడుకునే ప్రయత్నం చేశాడు.. చివరకు ఆ సింహానికి దొరికిపోయాడు.. ఒక్కసారిగా అతడి వేలును అందుకున్న ఆ సింహం.. తెగిపోయే దాకా.. వదలలేదు.. అప్పటిదాకా కుప్పగంతులు వేసిన ఆ వ్యక్తి.. వేలు పోయి విలవిల్లాడిపోయాడు.. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Read Also: CM Jagan and KTR Meet: విదేశీ గడ్డపై అరుదైన భేటీ.. గొప్ప సమావేశం అంటున్న కేటీఆర్..

ఇక, మనిషి వేలిని సింహం పూర్తిగా ఛిద్రం చేసింది.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా.. ఎవరూ గాయాలపాలు కాకుండా ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.. అయితే, సింహం దాడిలో ఆ వ్యక్తి తన ఉంగరపు వేలును పూర్తిగా కోల్పోయాడు. జమైకా అబ్జర్వర్‌తో మాట్లాడుతూ.. జూకీపర్ పై సింహం దాడిచేసినప్పుడు.. చూసేవాళ్లు అంతా ఇది ఒక జోన్‌ అని అనుకున్నారు.. ఆ సన్నివేశాలను తమ కెమెరాల్లో బంధించే పనిలో ఉండిపోయారని తెలిపారు.. కానీ, ఆ వ్యక్తి నేలపై పడినప్పుడు అది తీవ్రమైనదని అందరూ గ్రహించారని చెప్పారు… ఇప్పుడు, ఈ సంఘటన సింహం సంక్షేమం మరియు సిబ్బంది చికిత్స కోసం ఆందోళనకు దారితీసింది. జమైకా అబ్జర్వర్ నివేదించిన ప్రకారం, జమైకా సొసైటీ ఫర్ ది ప్రివెన్షనల్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్, పమేలా లాసన్, ఈ సంఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Show comments