Langur Viral Video: అచ్చు మనిషి లానే.. పానీపూరి ఇష్టంగా తింటున్న కొండముచ్చు! వీడియో చూస్తే షాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkey Eats Panipuri in Ghaziabad: ఈ రోజుల్లో ‘పానీపూరి’ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరి బండి కనిపిస్తేనే మనసు అటే లాగుతుంది. తినేవరకు మనసున పట్టదు. పానీ పూరీలో వేడివేడి పప్పు మిశ్రమం, సన్నని ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే.. ఆ మజానే వేరు. చలికాలంలో అయితే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. మనుషులే కాదు జంతువులకు కూడా పానీపూరీని ఇష్టపడుతున్నాయి. గతంలో ఓ ఏనుగు పానీపూరి తినగా.. తాజాగా ఓ కొండముచ్చు ఎంతో ఇష్టంగా తింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ కొండముచ్చు పానీపూరి ఇష్టంగా తింది. టంకరాలోని దయానంద్ చౌక్ వద్ద ఓ పానీపూరి బండి వద్దకు పెద్ద కొండముచ్చు వచ్చింది. పానీపూరి బండిపైకి ఎక్కి కూర్చుంది. చాట్ విక్రయించే వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా.. దానికి పానీపూరితో కూడిన ప్లేట్ ఇచ్చాడు. వాటిని ఆ కొండముచ్చు ఎంతో ఇష్టంగా తింది. ఒక్కొకటి తింటూ మొత్తం ప్లేట్లోని పానీపూరిలను ఖతం చేసింది. దీనిని చూసేందుకు స్థానికులు అక్కడ గుమిగూడారు.
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
Also Read: Lovers Romance Viral Video: గట్టిగా హత్తుకుని ముద్దులు.. బైక్‌పైనే లవర్స్ ఘాటు రొమాన్స్! 21 వేల ఫైన్
కొండముచ్చు పానీపూరి తింటుండగా.. ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది జనం చాట్ బండి వద్ద గుమికూడారు. కొందరు ఆనందంతో, మరికొందరు ఆశ్చర్యంగా దానిని చూశారు. చాలామంది ఈ సన్నివేశాన్ని తమ మొబైళ్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కాగా.. చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతేకాదు భిన్నమైన కామెంట్స్‌తో వీడియోని లైక్, షేర్ చేస్తున్నారు. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
માણસો બાદ હવે કપિરાજ પાણીપુરી પર ફિદા, જુઓ લારી પર કેટલી શાંતિથી આરોગી રહ્યા છે (VIDEO)#morbi #tankara #Kapiraj #monky #Ate #panipuri #viralvideo pic.twitter.com/OKiM6koEke
— Watch Gujarat (@WatchGujarat) June 20, 2023
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!