Strange Taxes: కేరళలో మహిళలు రొమ్ములను కవర్ చేయడంపై పన్ను.. ఎప్పుడంటే?

  • 19వ శతాబ్దంలో కేరళలో వింత పన్ను
  • రొమ్ములు కవర్ చేసుకునేందుకు పన్ను
  • నిమ్న కులాలు మహిళలే టార్గెట్
Kerala

Kerala

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశ జనవరి 31, 2025న ప్రారంభమై ఫిబ్రవరి 13, 2025న ముగుస్తుంది. యూనియన్ బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను నిర్దేశించేది. దేశ జీడీపీ వృద్ధి మందగిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇందులో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కాగా.. మనదేశంలో గతంలో విధించిన ఓ వింత పన్ను గురించి తెలుసుకుందాం..

READ MORE: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మరో విషాదం.. ట్రక్కు ఢీకొనడంతో పలువురి మృతి!

19వ శతాబ్దంలో కేరళలోని ట్రావెన్‌కోర్ రాజు నిమ్న కులాలు మహిళల రొమ్ములను కప్పి ఉంచడంపై పన్ను విధించాడు. వీరిలో ఈజావ, తీయ, నాడార్, దళిత వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఈ మహిళలు తమ రొమ్ములను కప్పి ఉంచడానికి అనుమతి ఉండేది కాదు. రొమ్ములను కవర్ చేసుకోవాలంటే భారీగా పన్నులు చెల్లించాల్సి వచ్చింది. చివరికీ నంగేలి అనే మహిళ కారణంగా, ట్రావెన్‌కోర్ మహిళలకు ఈ పన్ను నుంచి స్వేచ్ఛ లభించింది. ఈ పన్ను చెల్లించేందుకు నంగేలి నిరాకరించింది. ఒక టాక్స్ ఇన్‌స్పెక్టర్ పన్ను వసూలుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె పన్ను చెల్లించేందుకు నిరాకరించింది. పన్నుకు వ్యతిరేకంగా ఆమె తన రొమ్ములను కోసుకుని మరణించింది. దీనితో రాజు ఈ పన్నును రద్దు చేయవలసి వచ్చింది.

READ MORE: Thandel Pre Release Event : తండేల్ రాజు కోసం రంగంలోకి పుష్ప రాజ్?