Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Hong Kong 16 Square Feet Coffin Home Rent 40000 Rupees

Hong Kong Coffin Homes: జస్ట్ 16 స్క్వేర్ ఫీట్ రూమ్.. ఏకంగా రూ. 40 వేల అద్దె

Published Date :February 19, 2026 , 8:02 am
By Chandra Shekhar Pamena
Hong Kong Coffin Homes: జస్ట్ 16 స్క్వేర్ ఫీట్ రూమ్.. ఏకంగా రూ. 40 వేల అద్దె
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hong Kong Coffin Homes: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన హాంకాంగ్ లో విలాసవంతమైన భవనాలు, కోట్ల రూపాయల ఆస్తులతో ప్రసిద్ధి చెందింది. కానీ ఈ మెరుపుల వెనుక దాగి ఉన్న వాస్తవం మాత్రం చాలా దారుణమైంది. వేలాది మంది అక్కడ కేవలం 16 చదరపు అడుగుల చిన్న బాక్స్‌లాంటి గదుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీటినే “కాఫిన్ హోమ్స్” (Coffin Homes) అని పిలుస్తుంటారు.

Read Also: Pixel 10a India Launch: భారత్‌లో గూగుల్ ‘పిక్సెల్ 10ఏ’ విడుదల.. 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా!

Also Read

  • Shloka Mehta: ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్‌సిటీ.. వీడియో వైరల్
  • Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
  • Viral : పంది కడుపున 'ఏనుగు పిల్ల'.. విస్తుపోతున్న జనం.!
  • Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్

అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌..
గత 14 ఏళ్లుగా హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా కొనసాగుతోంది. ఒకవైపు ఆకాశాన్ని తాకే గాజు టవర్లు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు కనిపిస్తుంటే, మరోవైపు పేదలు, వృద్ధులు, తక్కువ ఆదాయ వర్గాల వారు తీవ్ర ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. నగర సంపదలో అధిక భాగం కొద్దిమంది ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండిపోయింది.

Read Also: Engineering Colleges Fees: ఇంజనీరింగ్ (B.E/B.Tech) కోర్సుల్లో ఫీజుల ఖరారు.. ఏ కాలేజీలో ఎంత ఫీజులు చెల్లించాలంటే!

నడిచేందుకు నో ఛాన్స్..
కాఫిన్ హోమ్స్ పరిమాణం సుమారు 16 చదరపు అడుగులు మాత్రమే.. అంటే 4 అడుగులు × 4 అడుగుల స్థలం.. అందులో ఒక చిన్న మంచం పెట్టిన తర్వాత ఇంకేమీ స్థలం ఉండదు.. నిలబడి ఉండటానికి కూడా అవకాశం ఉండదు. చేతులు చాచాలని చూసిన గోడలు తగులుతాయి. ఒక 800 చదరపు అడుగుల ఫ్లాట్‌ను 20 నుంచి 30 చిన్న గదులుగా విభజించి అద్దెకు ఇస్తున్నారు. ఆ ఒక్క గదిలోనే పడుకోవడం, తినడం, ఫోన్ ఉపయోగించుకోవడం, కొన్ని సందర్భాల్లో వంట చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

16 స్క్వేర్ ఫీట్ గదుల్లో 2.2 లక్షలు..
అంచనా ప్రకారం సుమారు 2 లక్షల నుంచి 2.2 లక్షల మంది వరకు ఇలాంటి 16 స్క్వేర్ ఫీట్ గదుల్లో జీవిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ గృహాల కోసం వేచి ఉండే సమయం సగటున ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ కఠిన పరిస్థితుల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ 16 చదరపు అడుగుల గదికే నెలకు 230 నుంచి 450 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.20,000 నుంచి రూ.45,000 వరకు) అద్దె చెల్లించాల్సి వస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు.

టాయిలెట్స్ పక్కనే వంట:
వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఇలాంటి చిన్న గదుల్లో గాలి సరిగ్గా రాకపోవడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. బెడ్ బగ్స్, చీమలు, కాక్రోచులు వంటి పురుగుల సమస్య కూడా హాంకాంగ్ లో అధికంగా ఉంటుంది. కొన్ని గదుల్లో ప్రత్యేక వంటగది అంటూ ఏమీ ఉండదు. టాయిలెట్ పక్కనే కూరగాయలు కడిగి వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా ప్రమాదకరమైనా, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బయట తినడం చాలా మందికి సాధ్యం కాదు.

75 మంది వద్దే 10 శాతం సంపద..
హాంకాంగ్‌లో కేవలం 75 మంది వ్యక్తులు నగర సంపదలో సుమారు 10 శాతం నియంత్రిస్తున్నారని తెలుస్తుంది. సాధారణ ప్రాంతాల్లో కూడా అపార్ట్‌మెంట్ల ధరలు మిలియన్ డాలర్లకు పైగా ఉంటాయి. ఒక సాధారణ ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దెనే నెలకు 4,000 డాలర్ల వరకు ఉంటుంది. దీంతో ఒకవైపు మెరుస్తున్న స్కైలైన్స్.. మరోవైపు 16 చదరపు అడుగుల బాక్స్‌ల్లో బతుకుతున్న ప్రజల జీవితాలు.. అభివృద్ధి, సంపద ఉన్నప్పటికీ, అసమానతల్లో ఎంత వ్యత్యాసం ఉందో హాంకాంగ్ నగరాన్ని చూస్తే తెలుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 16 square feet room rent
  • Hong Kong coffin homes
  • Hong Kong expensive rent
  • Hong Kong housing crisis
  • Hong Kong property prices

తాజావార్తలు

  • RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?

  • PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్‌ తొలగింపు

  • Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్‌ఫోలియోలో రూ.20 లక్షలు..

  • Adivi Sesh: “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions