Pixel 10a India Launch: భారత్‌లో గూగుల్ ‘పిక్సెల్ 10ఏ’ విడుదల.. 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా!
- భారత్‌లో 'గూగుల్ పిక్సెల్ 10ఏ' స్మార్ట్‌ఫోన్ రిలీజ్
- 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా
- 7 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘గూగుల్ పిక్సెల్ 10ఏ’ ఫోన్ (Google Pixel 10a India Launch) రిలీజ్ అయింది. గూగుల్ ఈ మిడ్–ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రూ.49,999 ధరతో అధికారికంగా విడుదల చేసింది. గత మోడల్‌తో పోలిస్తే ఈ ఫోన్‌లో కొన్ని కీలక మార్పులతో వచ్చింది. ముఖ్యంగా డిజైన్, డిస్‌ప్లే బ్రైట్‌నెస్, ఛార్జింగ్ స్పీడ్ వంటి అంశాల్లో కంపెనీ మార్పులు చేసింది. ఫ్రంట్, బ్యాక్ రెండింటికీ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే ఇది గత మోడల్ కంటే 0.1 మిల్లీమీటర్ సన్నగా.. 3 గ్రాములు తేలికగా ఉంది.
గూగుల్ పిక్సెల్ 10ఏలో 2000 నిట్స్ బ్రైట్‌నెస్, పీక్‌లో 3000 నిట్స్ వరకు సామర్థ్యం ఉంటుంది. అవుట్‌డోర్ విజిబిలిటీ మరింత బాగుంటుంది. అల్ట్రావైడ్ కెమెరాలో మాక్రో సపోర్ట్ ఇవ్వడంతో ఫోటోగ్రఫీ ప్రేమికులకు పండగే అని చెప్పాలి. లావెండర్, బెర్రీ, ఫాగ్, ఆబ్సిడియన్.. నాలుగు ఆకర్షణీయ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 6.3 అంగుళాల 1080p 120Hz ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 5100 mAh బ్యాటరీ, Tensor G4 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
పిక్సెల్ 10ఏలో కెమెరా సెటప్ ఏమాత్రం మారలేదు. గత మోడల్ లానే 48MP మెయిన్, 13MP అల్ట్రావైడ్, 13MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా 7 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్ ఈ ఫోన్‌కు పెద్ద ప్లస్ పాయింట్. బిగ్ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు లేకపోయినా.. చిన్నచిన్న అప్‌గ్రేడ్, అత్యున్నత సాఫ్ట్‌వేర్ సపోర్ట్, బ్రైట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఫోన్ బ్యాలెన్స్‌డ్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. అయితే రూ.49,999 ధర కొంతమందికి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. అయితే గూగుల్ ఫోన్‌లకు ఉండే క్రేజ్ వేరే లెవల్ అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!