Girlfriend For Rent: ఇండియాలో గర్ల్ ఫ్రెండ్ ఫర్ రెంట్.. రెండు రోజులకు పది వేలే.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girlfriend For Rent Divya Giri Video Viral in Social Media: గర్ల్ ఫ్రెండ్ ఫర్ రెంట్ అంటే గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకి తీసుకోవడం అన్నమాట. ఏంటి తర్జుమా చేస్తున్నావ్, కామెడీగా ఉందా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకప్పుడు కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనుకున్న కొన్ని కాన్సెప్టులు ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేస్తున్నాయి. విదేశాలలో అక్కడి పరిస్థితుల నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనే కాదు అమ్మని, నాన్నని, అక్కని చెల్లిని ఇలా ఏ రిలేషన్ ను అయినా అద్దెకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకిచ్చే సంస్థలు ఇంకా మొదలవలేదు కానీ కొంతమంది ఔత్సాహిక యువతులు తమకు తాము ఒక రెంట్ ఫిక్స్ చేసుకుని డేట్ కి సిద్ధమవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా దివ్య గిరి అనే ఒక యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మీరు సింగల్ గా ఉన్నారా? అయినా డేట్ కి వెళ్లాలనిపిస్తోందా? అయితే నన్ను మీ డేట్ కోసం అద్దెకి తీసుకోండి అంటూ ఆమె రాసుకొచ్చింది.
Chiranjeevi – Ajith: ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చిరు.. తమిళ హీరోతో మెగాస్టార్ చిరు..
Also Read
- Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
అంతేకాదు తనని ఒక రోజు మొత్తానికి అద్దెకి తీసుకుని కొన్ని అద్భుతమైన మెమరీస్ క్రియేట్ చేసుకోమని చెబుతోంది. అంతేకాదు తన అద్దెకు సంబంధించిన రేట్ కార్డు కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాని ప్రకారం కాఫీ డేట్ కి అయితే 1500, నార్మల్ డేట్ అంటే డిన్నర్ తో కలిపి మూవీ చూడటం 2000, కుటుంబంతో కలవడం 3000, ఏదైనా ఈవెంట్ కి కలిసి వెళ్లడం 3500, బైక్ డేట్ అంటే చేతులు పట్టుకోవడం వరకు 4000, సోషల్ మీడియాలో డేటింగ్ గురించి పోస్ట్ పెడితే 6000. అలాగే ఏదైనా అడ్వెంచర్స్ చేయాలంటే రోజు మొత్తానికి 5000, ఇంట్లో కలిసి వంట వండుకుని తినడానికి 3500, షాపింగ్ కలిసి చేయడానికి 4500, వీకెండ్ గెట్ అవే అంటే ఇద్దరు కలిసి ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకుంటే 10000. ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క రేటు కూడా ఆమె ఫిక్స్ చేసింది. అయితే ఇది నిజమా లేక సోషల్ మీడియా అటెన్షన్ కోసం ఆమె చేసిన విషయమా అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
-
Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!