Chiranjeevi – Ajith: ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చిరు.. తమిళ హీరోతో మెగాస్టార్ చిరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు 150 పైగా సినిమాలలో లీడ్ రోల్స్ చేసి కోట్ల సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్నాడు చిరు. ఇకపోతే ప్రస్తుతం ‘ విశ్వంభర ‘ షూటింగ్ లో పాల్గొంటున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇకపోతే మంగళవారం విశ్వంభర సినిమా షూట్ లొకేషన్ లోకి తమిళ్ స్టార్ ‘హీరో అజిత్’ వచ్చి సడన్ సప్రైజ్ ఇచ్చారు. దీనికి కారణం హీరో అజిత్ సంబంధించిన షూట్ కూడా విశ్వంభర పక్క సెట్ లోనే జరుగుతుండటంతో ఈ ఇద్దరు స్టార్స్ కలిశారు. ఈ సందర్బంగా హీరో అజిత్ తో దిగిన ఫోటోలను మెగాస్టార్ తన సోషల్ మీడియాలో ఖాతా ద్వారా షేర్ చేసి ఓ ఆసక్తికర పోస్ట్ ను అందించాడు.
Viral Video: గంగానది నుంచి బయటకు వచ్చిన పది అడుగుల మొసలి.. వీడియో వైరల్..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
చిరంజీవి షేర్ చేసిన ఫోటోల గురించి వివరిస్తూ.. మంగళవారం సాయంత్రం విశ్వంభర సెట్ లోకి అనుకోకుండా ఓ అతిధి వచ్చారు. పక్క సెట్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న అజిత్ తన దగ్గరకు వచ్చి కాసేపు గడిపారంటూ తెలిపాడు. ఆ సమయంలో తాము చాలా విషయాలు మాట్లాడుకున్నాం అని తెలిపాడు. ఈ సందర్బంగా అజిత్ తెలుగులో నటించిన మొదటి సినిమా ‘ప్రేమ పుస్తకం’ సమయంలోని విషయాలను గుర్తుచేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ప్రేమ పుస్తకం ఆడియో లాంచ్ నేనే చేశానని., అజిత్ భార్య షాలిని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిందంటూ.. ఆనాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుచేసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం అజిత్ ఎంత పెద్ద స్టార్ అయినా అదే మంచితనంతో ఉన్నాడని చిరు రాసుకొచ్చాడు. దింతో ప్రస్తుతం చిరు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!