NTV Telugu Site icon

Banke Bihari temple: చరణామృతంగా భావించి.. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తులు(వీడియో)

Banke Bihari Temple

Banke Bihari Temple

ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇందులో.. కొంతమంది భక్తులు ఆలయం వెనుక భాగం నుంచి కారుతున్న నీటిని చరణామృతంగా భావించి తాగడం కనిపిస్తుంది. నిజానికి ఇది ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు. దీన్ని ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చరణామృతంగా భావించి నీరు తాగుతున్న మహిళా భక్తురాలితో ఆ య్యూటూబర్ మాట్లాడుతూ.. ‘దీదీ.. ఇది చరణామృతం కాదు ఏసీ నీరు’ అని అంటాడు. దీంతో ఆ మహిళ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

READ MORE: IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్‌డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

బాంకే బిహారీ టెంపుల్ మొదటి అంతస్తులో వర్షపు నీరు పారుదల కోసం ఒక మార్గం ఉంది. దాని ఆకారం ఏనుగు నోరులా ఉంటుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు కూడా ఈ మార్గం గుండా పారుతూనే ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఎవరో ఒక భక్తుడు తెలియకుండానే చరణామృతంగా భావించి చేతిలో పెట్టుకుని జపం చేయడం ప్రారంభించారని చెబుతున్నారు. కాసేపటికే వెనుక నుంచి వస్తున్న ఇతర భక్తులు కూడా ఆ నీటిని గ్లాసుల్లో నింపి తాగడం ప్రారంభించారు. దీన్ని ఆ భక్తులు చరణామృతంగా భావిస్తున్నారు. ఈ నీటిని తాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. చాలా మంది భక్తులు పాత్రల్లో నీటిని నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

READ MORE:Stock market: అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

ఇలా చేయవద్దని అర్చకుల విజ్ఞప్తి..
ఈ వీడియో బయటకు రావడంతో బాంకే బిహారీ ఆలయ పూజారులు అలా చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇది గుడ్డి భక్తి అని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. అయితే.. దేశం, ప్రపంచం నుంచి ప్రతిరోజూ 10 నుండి 15 వేల మంది పర్యాటకులు మధుర, బృందావన్‌లకు వస్తున్నారు. ఈ చర్య వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Show comments