పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది..ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు కొన్ని రోజుల నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ సంబరాలు మొదలుపెట్టేశారు. గత కొద్ది రోజులుగా ర్యాలీలు, ఊరేగింపులతో హోరెత్తించారు. ఇక రిలీజ్ కు ముందురోజు నుంచే థియేటర్ల వద్ద హంగామా షురూ చేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలదండలు, పాలాభిషేకాలతో మూవీ రిలీజ్ ను పండగలా చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా రచ్చ మాములుగా లేదు.. ఎక్కడా తగ్గలేదు.. ఎక్కడ చూసిన ప్రభాస్ పేరు వినిపిస్తుంది..
ఈ మేరకు ఓ అభిమాని మాత్రం తన అభిమాన హీరో కోసం ఏకంగా రక్తం చిందించాడు. అందుకు సంబంధిచిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..’ఆదిపురుష్’ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ రచ్చ చేశారు. భారీ కటౌట్లు, కొబ్బరికాయలు, పూలదండలతో హోరెత్తించారు. తీన్మార్ డాన్స్ లతో హంగామా చేశారు. ఓ అభిమాని అత్యుత్సాహంతో ప్రభాస్ కటౌట్ వద్ద డాన్స్ చేస్తూ జై ప్రభాస్ అన్నా అంటూ బీర్ బాటిల్ ముక్కతో చేయి కోసుకున్నాడు. అలా నాలుగైదు సార్లు చేశాడు. ఆ రక్తంతో ప్రభాస్ ఫోటోకు తిలకం దిద్దాడు. ఇదంతా పక్కనే ఉన్న ఫ్యాన్స్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ అయింది..
ఆ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.. అంత అభిమానం ఎందుకు స్వామి.. అంతగా ఉండకేకుంటే రక్త దానం చేసి మనుషుల ప్రాణాలను కాపాడవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..ఈ సినిమా ఈరోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా పై మొదట్లో కాస్త విమర్శలు వచ్చినా రిలీజ్ సమయానికి అంతా పాజిటివ్ గా మారిపోయింది. దీంతో మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను దేశవ్యాప్తంగా 6,200 లకు పైగా స్క్రీన్ లలో విడుదల చేశారు. ఇప్పటికే మూవీ విడుదల అయి సక్సెస్ టాక్ ను అందుకుంది.. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా భారీ గానే జరిగాయి..ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..
Offline cult fans 🥵🔥
Beer bottle cheyyi koskunnadu 🙏🏼#Prabhas #Adipurush #AdipurushCelebrations pic.twitter.com/FZl3PfAww1
— ❌ BEAST ❌ (@thedevilmonstr) June 16, 2023