టాలీవుడ్ హీరోయిన్ ఆదా శర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూ పర్వాలేదనిపించింది.. ఇక గత ఏడాది వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ సినిమా విడుదల కాకముందే ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా మారింది.. విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..
లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఆరేంజ్ కలర్ శారీలో మెరిసింది.. ఆ చీర చూడటానికి చాలా సింపుల్ గా ఉంది.. ఆదా శర్మ అందాన్ని రెట్టింపు చేసింది.. ట్రెండీ బ్లౌజ్ తో చాలా క్యూట్ గా కనిపించింది. ఆమె కనపడటం ఆలస్యం కెమెరా మెన్స్ ఫోటోలను క్లిక్ మనిపించారు.. అందులో కొందరు ఆ చీర ధర ఎంతో అడిగారు.. దానికి ఆదా ఇచ్చిన సమాధానం విని షాక్ అయ్యారు..
ఇంతకీ ఆ చీర ధర కేవలం 15 రూపాయలు మాత్రమే అట.. అంత తక్కువ ధరకు చీరలు ఎలా వస్తాయి అనే సందేహం వస్తుంది కదూ.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ చీర ధర అంతే.. అది వాళ్ల నానమ్మ చీర అట.. ఆ రోజుల్లో రూ.15 అంటే.. చాలా ఎక్కువే అని మరి కొందరు బదుులిస్తున్నారు. ఇక ఒకరైతే.. 15 రూపాయల చీరకు.. రూ.3వేల రూపాలయల బ్లౌజ్ కుట్టించుకున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ చీరలో ఉన్న ఆదా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య వివాదాస్పద సినిమాల్లోనే నటిస్తుంది.. ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ ‘ లో నటించింది.. ఇటీవలే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మొదటి షో తో కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ ను అందుకోవడం ఈ సినిమాను పలు చోట్ల రద్దు చేసినట్లు నెట్టింట వార్తలు వినిపించాయి..