Site icon NTV Telugu

Viral Video: తాగిన మత్తులో విష సర్పంతో ఆటలు.. చివరికి ఏమైందంటే..

Snake

Snake

కొంత మంది మద్యం తాగితే ఏం చేస్తున్నారో వారికి కూడా తెలియదు. మందు దిగాక వారు చేసిన పనులు వారికే చిరాకు తెప్పిస్తాయి. మద్యం మత్తులో ధైర్యం పెరుగుతుంది. ఎంతటికైనా తెగిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఓ యువకుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తించాడు. అసలేమైందంటే… ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విచిత్రమైన, ప్రమాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నాగరాజు అనే యువకుడు మద్యం మత్తులో ప్రాణాలను పణంగా పెట్టి విషసర్పంతో డేంజరస్ గేమ్ ఆడాడు. నాగరాజు మద్యం మత్తులో రోడ్డుపై తిరుగుతుండగా ఓ నాగుపాము రోడ్డు దాటుతూ కనిపించింది. ఆ తర్వాత మద్యం మత్తులో పామును వెంబడించి రోడ్డుపైకి లాగి దాన్ని వేధించడం మొదలుపెట్టాడు.

READ MORE: CPM: సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు.. వీటి సంగతి చూడండి..!

నాగరాజు పామును రోడ్డుపైన ఉంచి చేతులు, కాళ్లతో కొట్టడం ప్రారంభించాడు. అతని వింత ప్రవర్తన చూసి బాటసారులు ఆగి వీడియోలు తీశారు. ఇంతలో నాగరాజు పాముతో ఆడుకుంటూ సుమారు గంటపాటు దాన్ని ఇబ్బంది పెట్టాడు. ఆ సమయంలో నాగరాజును పాము కాటేసింది. కాటేసినా కూడా పాముతో ఆడటం మాత్రం మానలేదు. ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాగరాజును ఆస్పత్రికి తరలించారు. పామును సురక్షితంగా అడవిలోకి వదిలారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగరాజు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Exit mobile version