NTV Telugu Site icon

Viral Video: కారుపై ఆభరణాలు వదిలి వెళ్లిన యువతి.. ఎవరైనా దొంగిలిస్తారా? అని ప్రయోగం..(వీడియో)

Viral Video

Viral Video

ఈరోజుల్లో నగలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువవయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే దుబాయ్‌లో ఓ మహిళ ఆభరణాల భద్రతకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కి చెందిన ఓ యువతి బహిరంగ ప్రదేశాల్లో ఆభరణాల భద్రతకు సంబంధించి ఆశ్చర్యకరమైన ప్రయోగం చేసింది. ఆమె తన నెక్లెస్, ఉంగరాలను తీసి తన కారు బానెట్ మీద ఉంచి అక్కడ నుంచి కొంచెం దూరంలో నిలబడింది. ఈ ఆభరణాలను ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నిస్తారా? అని తెలుసుకోవడానికే ఇదంతా చేసింది.

READ MORE: Sukumar : దట్ ఈజ్ సుకుమార్.. ఆయన గొప్పతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది !

మహిళ నగలను 30 నిమిషాల పాటు అక్కడే ఉంచింది. ఈ సమయంలో చాలా మంది అటుగా వెళ్లినప్పటికీ ఎవరూ ఆభరణాలను తాకడానికి లేదా దొంగిలించడానికి ప్రయత్నించలేదు. చివరకు ఆ మహిళ వెళ్లి తన నగలను వెనక్కి తీసుకుంది. ఈ ఘటనపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె.. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆభరణాలు భద్రంగా ఉండే దేశం దుబాయ్ అని చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ ఘటనపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దుబాయ్ భద్రతా వ్యవస్థ, ప్రజలను ప్రశంసించారు. “దుబాయ్‌లో దొంగతనం చేయడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ కఠినమైన శిక్షలు ఉన్నాయి.” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కాగా.. దుబాయ్‌లోని కఠినమైన న్యాయ వ్యవస్థ, కఠినమైన శిక్షా విధానాల కారణంగా దొంగతనాలు చాలా తక్కువ. ఈ మహిళ చేసిన ఈ ప్రయోగం దుబాయ్ భద్రతను ప్రపంచానికి చూపించడమే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద చర్చను సృష్టించింది.

READ MORE: Success Story: చదువు కోసం ఇండియా వచ్చిన ఫ్రెంచ్ వ్యక్తి.. శాండ్‌విచ్‌లు అమ్ముతూ నెలకు రూ.4 కోట్లు సంపాదన!