NTV Telugu Site icon

Maharashtra: కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఫైలులో నుంచి బయటకు వచ్చిన విషసర్పం

Maharashtra

Maharashtra

మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఒక్కసారిగా విష సర్పం బయటకు వచ్చింది. కోర్టులోని ఫైళ్ల గుట్టలోంచి పాము రావడంతో కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. కోర్టు హాలులో ఉన్నవారంతా పాము భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ముంబైలోని ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కోర్టు విచారణ సందర్భంగా.. కోర్టులోని రూం నంబర్ 27లోని ఫైళ్ల మధ్య దాదాపు 2 అడుగుల పొడవున్న పాము కనిపించింది.

READ MORE: Delhi: ఢిల్లీ అల్లర్ల నిందితుడి ఇంటికి ఎంఐఎం నేత.. ఎన్నికల్లో పోటీ చేస్తాడనే ప్రచారం..

పాము బయటకు రావడంతో సభా కార్యకలాపాలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. న్యాయమూర్తి కూడా తన కుర్చీని వదిలి నిలబడ్డారు. పాము బయటకు రాగానే కోర్టు గదిలో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారని ఓ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయమూర్తి కోర్టు విచారణను కాసేపు వాయిదా వేశారు. పాము పట్టేవారిని పిలిపించి కోర్టు హాలులో వెతికినా ఫలితం లేకపోయింది. పాత ఫైళ్లను తొలగించి చాలా సేపు వెతికినా కోర్టు గదిలో పాము కనిపించలేదని లాయర్ తెలిపారు. గదిలోని రంధ్రం నుంచి పాము బయటకు వచ్చిందని భావిస్తున్నారు. అయితే కోర్టు ఆవరణలో పాములు కనిపించడం ఇదే మొదటిసారి కాదని న్యాయవాది తెలిపారు. సోమవారం కూడా కోర్టు గది కిటికీపై పాము కనిపించిందని చెప్పారు. రెండు నెలల క్రితం న్యాయమూర్తి ఛాంబర్‌లో పాము కనిపించింది. ఈ కోర్టు గది చుట్టూ చెట్లు, మొక్కలు ఉన్నాయని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు.

READ MORE: Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)

Show comments