Site icon NTV Telugu

Viral News: మనుషులకే దిక్కులేదు.. కోడికి బర్త్‌ డే వేడుకలేంట్రా నాయనా

Untitled 5

Untitled 5

పుట్టిన రోజు వేడుకలు మనుషులకు చేయడం సహజం. అయితే జంతు ప్రేమికులు కొందరు ఈ మధ్య కాలంలో పెంపుడు జతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. సాధారణంగా పెంపుడు జంతువులుగా కుక్క, పిల్లి ని పెంచుకోవడం.. వాటికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఘటనలు గతంలో కొన్ని ఉన్నాయి. కాగా తాజాగా ఈ కోవలోకి కోడి కూడా చేరింది. ఓ కుటుంబం కోడికి రెండో పుటిన రోజు వేడుకలు జరిపింది. వివరాలలోకి వెళ్తే.. ఓ కుటుంబం ఓ కోడి పుంజును పెంచుకుంటుంది.

Read also:Jelamoni Ravinder Mudiraj: అనుచరులకు దోచిపెడుతున్నాడు.. కిషన్ రెడ్డి పై జిలమని రవీందర్ ఫైర్

ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కోడి పుంజుకు రెండో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద కేక్ ను కూడా ఏర్పాటు చేశారు. కాగా ఆ కుటుంబం లోని ఓ యువతి కోడిని పట్టుకుని ఆ కోడి కాళ్ళతో కేక్ ను కట్ చేపించింది. అనంతరం అందరూ ఆ కోడికి కేక్ కూడా తినిపించారు. అలానే హ్యాపీ బర్త్‌ డే సాంగ్‌ పాడారు. అనంతరం అంతా కోడి బర్త్‌ డేని ఎంజాయ్‌ చేశారు. కాగా ఈ కోడి బర్త్‌ డే సెలబ్రేషన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనితో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా వీడియో చూసిన నెటిజన్స్ లో కొందరు కోడికి బర్త్‌ డే వేడుక జరుపడాన్ని అభినందించారు. అయితే చాలా మంది ఆ కోడిపై పలు రకాలుగా జోకులు వేస్తూ కామెంట్లు చేశారు.

Exit mobile version