Jelamoni Ravinder Mudiraj: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఈనేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మల్ రెడ్డి రంగారెడ్డి తరఫున, టిడిపి, కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలుగా ఏర్పడి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే.. అభివృద్ది ఎలా జరుగుతంది అంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా, టిటిడిపి రాష్ట్ర కార్యదర్శి జిలమని రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల అవకాశం ఇచ్చారని అన్నారు. నాడు టిడిపి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఇచ్చిందని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ అవే పథకాలపేరుతో వచ్చాయని తెలిపారు. ఇంకా సంక్షేమం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను తన అనుచరులకు దోచి పెట్టారని మండిపడ్డారు. పేద ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇష్ట రాజ్యాంగా వ్యవహరించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్, స్రవంతి చందు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
KTR: మా ఫేక్ డీపీతో దుష్ప్రచారం చేస్తున్నారు.. ప్రత్యర్థులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు