NTV Telugu Site icon

Viral Video: కొండచిలువపై నక్క భీకర దాడి.. వీడియో వైరల్

Fox

Fox

చిన్న జంతువులు కూడా.. ఓ పెద్ద జంతువుతో పోరాడుతాయని ఈ వీడియో చూస్తే నమ్మవచ్చు. భారీ కొండచిలువతో నక్క భీకర దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతకుముందు మరో నక్కను భారీ పైథాన్ చుట్టేసింది. ఈ క్రమంలో దాని నుండి రక్షించేందుకు నక్క తీవ్రంగా పోరాడింది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న గిర్ ఫారెస్ట్ లో రెండు వన్యప్రాణుల మధ్య జీవన్మరణ పోరాటాన్ని చూపే వీడియో కనిపించింది.

Read Also: SKN : కాలేజీ బాయ్స్ హాస్టల్లో రష్మీ ఫొటోలు.. పాపం ఇరకాటంలో పెట్టేశాడుగా!

ఓ నక్కను కొండచిలువ గట్టిగా చుట్టేసింది. అయితే దాని బారినుండి రక్షించడానికి మరో నక్క పైథాన్ తో దాడికి దిగుతుంది. తన స్నేహితుడిని రక్షించాలనే సంకల్పంతో నక్క కొండచిలువపైకి దూసుకెళ్లి, తన శక్తితో కొరికి, పంజా విసురుతుంది. ఎంత దాడి చేసినప్పటికీ.. కొండచిలువ మాత్రం నక్కను వదలడం లేదు. దానికున్న బలమే అది కావున.. చివరి వరకు పోరాడి నక్కను వదిలిస్తుంది మరో నక్క.

Read Also: Akhilesh Yadav: మణిపూర్‌లో జీ20 సదస్సును నిర్వహించండి.. కేంద్రంపై అఖిలేష్ మండిపాటు

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను @bawaramai అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వందలాది మంది చూసి లైక్ చేయగా.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.