NTV Telugu Site icon

Today (19-12-22) Business Headlines: రెడ్డీస్‌ నుంచి.. ‘రామాయపట్నం’ వరకు..

Today (19 12 22) Business Headlines

Today (19 12 22) Business Headlines

Today (19-12-22) Business Headlines:

ఆస్తులు అమ్ముతున్న రెడ్డీస్‌: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ నెదర్లాండ్స్‌లోని కొన్ని ఆస్తులను మరియు అప్పులను విక్రయించబోతోంది. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన డెల్‌ఫార్మా గ్రూపుతో ఒపందం చేసుకుంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బీవీ పేరుతో అనుబంధ సంస్థ ఉంది. దీనికి సంబంధించిన ఆస్తులను, రుణాలను అమ్మటంతోపాటు ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది. ఇదంతా ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

ఇవాళ్టి నుంచే ‘సర్కారీ గోల్డ్’

పెట్టుబడిదారులకు మరో చక్కని అవకాశం అందుబాటులోకి వచ్చింది. గవర్నమెంట్‌ మూడో విడత గోల్డ్‌ బాండ్‌లను ఇవాళ సోమవారం నుంచి జారీ చేస్తోంది. వీటిని శుక్రవారం వరకు కొనుగోలు చేయొచ్చు. ఒక్కో యూనిట్‌.. అంటే.. ఒక్కో గ్రాము బంగారం రేటును 5 వేల 409 రూపాయలుగా నిర్ణయించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి ఒక్కో గ్రాముపై 50 రూపాయలు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. 4వ విడత గోల్డ్‌ బాండ్లను మార్చి 6-10 తేదీల్లో జారీ చేస్తామని పేర్కొంది. ఈ బాండ్ల కాల పరిమితి 8 ఏళ్లు. ఐదేళ్ల తర్వాత వడ్డీ చెల్లించే తేదీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విత్‌డ్రా చేసుకునే వీలు కూడా ఉంది.

2 కోట్ల లోపు నేరానికే కేసు

గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌కు సంబంధించిన కొన్ని నేరాలను ప్రభుత్వం క్రిమినల్‌ పరిధి నుంచి తొలగించింది. ఇకపై 2 కోట్ల రూపాయలకు మించిన నేరాలపైనే క్రిమినల్‌ చర్యలు చేపట్టనుంది. ఇప్పటివరకు ఈ పరిధి కోటి రూపాయలుగా ఉంది. నకిలీ రసీదులకు సంబంధించిన నేరాల్లో మాత్రం ఈ లిమిట్‌ని పెంచకపోవటం గమనించాల్సిన విషయం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 48వ జీఎస్టీ కమిటీ మీటింగ్‌ మొన్న శనివారం జరిగింది. అజెండాలో 15 అంశాలు ఉండగా అన్నింటిపైనా చర్చించేందుకు సమయం లేకపోవటంతో 8 అంశాల పైనే చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

read more: Today (19-12-22) Stock Market Roundup: ఈ వారం శుభారంభం. ఇవాళ లాభాల బాటలో పయనం.

ఆ దేశాలకీ రూపాయల్లోనే

ప్రస్తుతం రష్యా, శ్రీలంక, మారిషస్‌ దేశాలకు రూపాయల్లో ట్రేడ్‌ పేమెంట్లు చేస్తున్న ఇండియా ఈ సౌకర్యాన్ని మరిన్ని దేశాలకు విస్తరించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇకపై బంగ్లాదేశ్‌ మరియు ఈజిస్ట్‌ తదితర ఆఫ్రికా దేశాలకు కూడా ఈ విధంగానే ఎగుమతులకు, దిగుమతులకు చెల్లింపులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు గల సాధ్యాసాధ్యాలను బ్యాంకులు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యా, శ్రీలంక, మారిషస్‌లకు రూపాయల్లో పేమెంట్లు చేసేందుకు ప్రత్యేకంగా వోస్ట్రో ఖాతాలను ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే.

డైరెక్ట్‌ ట్యాక్స్‌లో 20% గ్రోత్‌

గతేడాదితో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు దాదాపు 20 శాతం అధికంగా జరిగాయి. ఈ నెల 17వ తేదీ నాటికి మొత్తం కలెక్షన్లు 11 లక్షల 35 వేల 754 కోట్ల రూపాయలకు చేరాయి. పోయినేడాది ఇదే సమయం నాటికి 9 లక్షల 47 వేల 959 కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి. రిఫండ్స్‌కి సర్దుబాటు చేయకముందు వరకు ఉన్న స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో మాత్రం సుమారు 26 శాతం గ్రోత్‌ నమోదైందని అధికారులు తెలిపారు. ముందస్తు పన్ను చెల్లింపుల్లో కూడా కిందటేడాది కన్నా ఈసారి దాదాపు 13 శాతం వృద్ధి నెలకొందని పేర్కొన్నారు.

‘రామాయపట్నానికి’ రుణం

ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సార్‌ వైజాగ్‌ పోర్ట్‌తోపాటు కృష్ణపట్నం నౌకాశ్రయానికి లోన్‌ ఇచ్చిన సంగతి తెలిసింది. ఈ సంస్థ లేటెస్ట్‌గా రామాయపట్నం పోర్టుకు కూడా రుణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రామాయపట్నం మరియు భావనపాడుతోపాటు త్వరలో అందుబాటులోకి రానున్న మూడు నౌకాశ్రయాలతో సరుకు నిర్వహణ సామర్థ్యం అదనంగా లభిస్తుందని, వంద కోట్ల టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. రామాయపట్నం పోర్టు వచ్చే ఏడాది డిసెంబర్‌లో లాంఛ్‌ కానుంది. ఈ నౌకాశ్రయం కెపాసిటీ 3 పాయింట్‌ 4 కోట్ల టన్నులని ఐఐఎఫ్‌సీఎల్‌ తెలిపింది.