Drunken Altercation In Siddipeta: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన రశీద్, అతడి మిత్రుడు హైదరాబాద్‌కు చెందిన విష్ణుతో కలిసి గురువారం కారులో దుబ్బాకకు వస్తున్నారు. ఆదే పట్టణంలో గంగమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో కారులో దుబ్బాకకు చెందిన దేవుని రమణ, శివ సాయి, పర్స భాస్కర్, రాచమల్లు వినోద్ (అలియస్ బొమ్మ), ఆలేటి శరత్ వారి కారును అడ్డగించారు. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు రశీద్, విష్ణుతో గొడవ పడ్డారు. అంతటితో అగకుండా వారిపై బీరు సీసాలతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.