Most used apps: రోటీ.. కప్డా.. ఔర్ మకాన్.. అంటే.. తిండి.. బట్ట.. మరియు ఇల్లు. ఇది రాజకీయ పార్టీల నినాదం కాదు. ఓట్లు రాల్చే ప్రచార మంత్రం అసలే కాదు. ఇవి.. వినియోగదారులు వెతికిన సేవలు. వీటి కోసమే యూజర్లు మొబైల్‌లో తెగ సెర్చ్ చేశారు. సంబంధిత యాప్‌లను ఎక్కువగా డౌన్‌లోడ్ చేశారు. మార్చి నెలకు సంబంధించిన ఈ వివరాలను వివిధ సంస్థలు వెల్లడించాయి.
కరోనా మహమ్మారి తర్వాత కూడా భారతీయులు సెల్‌ఫోన్లకు మరియు వాటిలో కొన్ని యాప్‌లకు అడిక్ట్ అవుతున్నారు అనటానికి ఇదే సాక్ష్యమని సర్వేలు తెలిపాయి. ఫుడ్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం దగ్గర నుంచి అద్దె ఇళ్ల కోసం, ఇళ్ల కొనుగోలు కోసం మరియు డ్రెస్‌ల సెలక్షన్ కోసం యాప్‌లను అధికంగా వాడుతున్నారు.
Super Success Story: ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రత్యేక ఇంటర్వ్యూ. వహ్‌వా అనిపించే విజయగాథ
కరోనా లాక్‌డౌన్‌లకు కాలం చెల్లిపోయి ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ జనం ఎక్కువ శాతం కీలకమైన కన్జ్యూమర్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లపైనే ఆధారపడుతున్నారు. నిత్యావసర సరుకులు.. చివరికి ఉద్యోగాల కోసం కూడా యాప్‌లనే ఆశ్రయిస్తున్నారని సెన్సార్ టవర్స్ మంత్లీ డేటా ప్రింట్ పేర్కొంది.
వివిధ సంస్థలు నియామకాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ ఉద్యోగార్థులు జాబ్ పోర్టల్స్‌ని సందర్శిస్తూనే ఉన్నారు. మరోవైపు.. బ్యూటీ యాప్‌లను ఓపెన్ చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. నైకా మరియు పర్పుల్ వంటి యాప్‌ల ట్రాఫిక్ నెలనెలా డౌన్ అవుతోంది.
ఓమ్ని ఛానల్ మరియు ఫిజికల్ స్టోర్ విజిట్‌ల సంఖ్య పెరగటం వల్లే ఆన్‌లైన్ పర్ఛేజ్‌ల సంఖ్య తగ్గుతోందని
విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా.. ఫుడ్ డెలివరీ యాప్‌ల డౌన్‌లోడ్‌లు పెరుగుతుంటే స్విగ్గీ వంటి యాప్‌ల డౌన్‌లోడ్‌లు తగ్గిపోతుండటం గమనించాల్సిన విషయం.
ఇక.. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఈ మ్యానియా.. ఫుడ్ డెలివరీ యాప్‌లకు కూడా పాకింది. జొమాటో సంస్థ జెడ్‌పీఎల్ పేరుతో, స్విగ్గీ కంపెనీ మ్యాచ్ డే మ్యానియా పేరుతో ప్రత్యేక యాప్‌లను లాంఛ్ చేశాయి. దీంతో వాటి మంత్లీ యాక్టివ్ యూజర్స్ సంఖ్య వరుసగా 4 పాయింట్ 9 మరియు 4 పాయింట్ 6 చొప్పున పెరిగి 53 మిలియన్‌లు మరియు 35 మిలియన్లకు చేరాయి. ఫలితంగా డోమినోస్ పిజ్జా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అద్దె ఇళ్లు మరియు ఇళ్ల కొనుగోలు కోసం వెతికేవారు ఆన్‌లైన్‌ని బేస్ చేసుకుంటూ ఉండటంతో హయ్యస్ట్ ట్రాఫిక్ నమోదవుతోంది. 99 యాకర్స్, హౌజింగ్ మరియు మ్యాజిక్‌బ్రిక్స్ వంటి యాప్‌లకు డైలీ మరియు మంత్లీ యూజర్ల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ నేపథ్యంలో భౌతిక దూరాలు పెరిగినందున ఫ్యాషన్ దుస్తులకు గిరాకీ ఏర్పడింది.
దీంతో కస్టమర్లు యాప్ బేస్డ్ బుకింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టారు. ఫలితంగా.. ఆన్‌లైన్ సేల్స్‌లో వృద్ధి నెలకొంది. యువత తమకు సరైన జోడీని సెలెక్ట్ చేసుకోవటానికి కూడా వెబ్‌సైట్‌లను మరియు యాప్‌లనే వినియోగిస్తున్నారు. మంత్లీ మరియు డైలీ యాక్టివ్ యూజర్ల విషయంలో ఇప్పటికీ షాదీ డాట్ కమే లీడర్‌లా దూసుకెళుతోంది.