L & T Company: ఇండియన్ మల్టీనేషనల్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రోకి కొత్తగా అతిపెద్ద ఆర్డర్ వచ్చింది. ప్రతిపాదిత ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ ఆర్డర్‌ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీ.. గుజరాత్‌లో దాదాపు 82 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో డిపోను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయితే ఇదే ఇండియాలో అతిపెద్ద డిపోగా నిలిచిపోనుంది.
ఈ విషయాన్ని స్టాక్ ఎక్సే్ంజ్‌లకు తెలియజేసింది. అయితే.. ఈ ఆర్డర్ విలువ ఎంత అనే సంగతిని మాత్రం వెల్లడించలేదు. పెద్ద ప్రాజెక్టు అని చెప్పింది కాబట్టి దీని వ్యాల్యూ కనీసం 2 వేల 500 కోట్ల రూపాయల నుంచి 5 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సబర్మతి ప్రాంతంలో తలపెట్టిన ఈ డిపోను ఎల్ అండ్ టీ.. జపాన్‌కి చెందిన సోజిట్జ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని కన్సార్షియంతో కలిసి నిర్మిస్తుంది. డిపోకి సంబంధించిన అన్ని అంశాలను.. అంటే.. డిజైన్, సప్లై, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, కమిషనింగ్ వంటి వాటికి ‘ఎల్ అండ్ టీ’దే బాధ్యత.
read more: Digital Payments: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు
షింకన్‌సెన్ టెక్నాలజీ ఆధారంగా రోలింగ్ స్టాక్‌ను తనిఖీ చేయడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన వివిధ ప్రత్యేక పరికరాలను సైతం ఈ సంస్థే ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ‘ఎల్ అండ్ టీ’ ఇప్పటికే ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో సివిల్ వయాడక్ట్, స్టేషన్ ప్యాకేజ్‌లు, స్పెషల్ స్టీల్ బ్రిడ్జ్‌ల ప్యాకేజ్‌లు, బ్యాలెస్ట్‌లెస్ ట్రాక్‌ల పనులు చేస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుతం 50కి పైగా దేశాల్లో మ్యానిఫ్యాక్షరింగ్ అండ్ సర్వీస్‌లను అందిస్తున్న సంగతి తెలిసిందే.