NTV Telugu Site icon

Google and Twitter: గూగుల్‌, ట్విట్టర్‌ తాజా నిర్ణయాలు

Google and Twitter

Google and Twitter

Google and Twitter: గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు ఇతర దేశాలతోపాటు ఇండియాలో కూడా ఖర్చులను తగ్గించుకోవటంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఇన్నాళ్లూ ఉద్యోగులను రాత్రికిరాత్రే తీసివేయగా ఇప్పుడు ఆఫీసులను సైతం తెల్లారే సరికి మూసివేస్తున్నాయి. తాజాగా గూగుల్ మరియు ట్విట్టర్ సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి. గూగుల్‌ కంపెనీ 453 మందికి లేఆఫ్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వందల మంది ఉద్యోగులను తీసేయటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

read more: Air India order support US jobs: బోయింగ్‌కి ఎయిరిండియా ఆర్డర్‌ వల్ల అమెరికాలో ఎన్నో జాబులు: బైడెన్‌

ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితుల వల్లే ఇలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందంటూ గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ కంపెనీ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో పేర్కొన్నట్లు ప్రముఖ ఇంగ్లిష్‌ మీడియా సంస్థ తెలిపింది. ఇదిలాఉండగా.. మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌.. ఇండియాలోని మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.

ఇప్పుడిక బెంగళూరులోని ట్విట్టర్‌ ఆఫీస్‌ మాత్రమే రన్నింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ అధిపతి అయ్యాక ఈ సోషల్‌ మీడియా సంస్థ గతేడాది చివరలో ఇండియాలోని మొత్తం సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించిన సంగతి తెలిసింది. ఈ నిర్ణయం అనంతరం ఈ కంపెనీ పే-రోల్‌లో కేవలం 12 మంది మాత్రమే మిగిలారు. ఖర్చులను భారీగా కుదించుకోవటం ద్వారా బ్యాలెన్స్‌ షీట్‌ను మెయిన్‌టెయిన్‌ చేయాలని భావించి ఆఫీసులను క్లోజ్‌ చేయటానికి కూడా ట్విట్టర్‌ వెనకాడలేదు.

Show comments