Flight Journeys: మన దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. 2021వ సంవత్సరంతో పోల్చితే 2022లో 47 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. దేశీయ విమాన ప్రయాణాల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. DGCA.. లేటెస్ట్‌గా వెల్లడించింది. 2022లో 12 కోట్ల 32 లక్షల 45 వేల మంది ఫ్లైట్లలో జర్నీ చేయగా 2021లో 8 కోట్ల 38 లక్షల 14 మంది మాత్రమే ప్రయాణించారు.
Global Economic Downturn: ఇండియా వాణిజ్యంపై ప్రభావం ప్రారంభం
2022 నవంబర్ కన్నా డిసెంబర్‌లో 13 పాయింట్ ఆరు తొమ్మిది శాతం అధిక విమాన ప్రయాణాలు నమోదయ్యాయి. ఎయిరిండియా, స్పైస్‌జెట్, గోఫస్ట్, ఇండిగో, ఆకాశ ఎయిర్, ఎయిరేసియా ఇండియా, విస్తారా వంటి ఎయిర్‌లైన్స్‌లో ఈ గ్రోత్ నెలకొంది. 56 శాతానికి పైగా మార్కెట్ షేరుతో ఇండిగో సంస్థ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 9 పాయింట్ 2 శాతం వాటాతో విస్తారా రెండో ర్యాంక్ పొందింది.
స్పైస్‌జెట్ మరియు ఎయిరిండియా 8 పాయింట్ 7 శాతం చొప్పున మార్కెట్ వాటాలతో కంబైన్డ్‌గా మూడో ప్లేస్ దక్కించుకున్నాయి. 2022 డిసెంబర్‌లో ప్రయాణికుల నుంచి 408 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం విమాన సమస్యలకు మరియు రిఫండ్స్‌కు సంబంధించినవేనని, 98 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని DGCA వివరించింది.