NTV Telugu Site icon

Bill Gates Financial Support to Africa: కావాలి ఇంకా.. అంటున్న ఆఫ్రికా..

Bill Gates Financial Support To Africa

Bill Gates Financial Support To Africa

Bill Gates Financial Support to Africa: ఆఫ్రికా పురోభివృద్ధికి తన వంతు సాయం చేసేందుకు అమెరికన్‌ బిలియనీర్‌, మైక్రోసాఫ్ట్‌ కోఫౌండర్‌ బిల్‌గేట్స్‌ ముందుకొచ్చారు. తన సంపదలో కొంత భాగాన్ని ఇందుకు కేటాయించనున్నట్లు మాటిచ్చారు. ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలకు నాలుగేళ్లలో 7 బిలియన్‌ డాలర్లు ఖర్చుపెడతానని అన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల నైరోబీలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. అలాగే.. వైద్య మరియు వ్యవసాయ పరిశోధన సంస్థలకు, పంట పొలాలకు వెళ్లారు.

ఈ రెండు సెక్టార్ల ప్రోగ్రెస్‌ దిశగా వాస్తవానికి ఏం అవసరమో, ఏమేం ఆటంకాలు ఎదురవుతున్నాయో క్షేత్ర స్థాయిలో గమనించారు. అయితే.. ఆ ఖండం డెవలప్‌ కావటానికి బిల్‌ గేట్స్‌ ఇచ్చే నిధులు ఏ మూలకూ సరిపోవు. ఎందుకంటే.. నిజంగా అవసరమైన మొత్తం బడ్జెట్‌లో ఆయన ఇచ్చేది కేవలం 5 శాతమే. ఆఫ్రికాకు బిల్‌గేట్స్‌ చేసే దానం కన్నా కనీసం 20 రెట్లు ఎక్కువ ఫండ్స్‌ అవసరం. ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం ఆ ప్రాంత ఆరోగ్య రంగంలో నెలకొన్న ఫైనాన్సింగ్‌ లోటు 66 బిలియన్‌ డాలర్లు. జీడీపీలో 15 శాతం నిధులు కేటాయించాలన్న అబుజా డిక్లరేషన్‌ని కేవలం 3 ఆఫ్రికా దేశాలు మాత్రమే పాటిస్తున్నాయి.

read more: L & T Company: ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌

అధికాదాయ దేశాలు ఆరోగ్యానికి 4 వేల డాలర్లకు పైగా తలసరి ఖర్చుపెడుతుండగా ఆఫ్రికన్‌ కంట్రీస్‌ కేవలం 8 డాలర్ల నుంచి 129 డాలర్ల వరకు మాత్రమే వెచ్చించగలుగుతున్నాయి. సబ్‌ సహారా ఆఫ్రికాలోని వ్యవసాయ రంగానిదీ ఇదే పరిస్థితి. 74 పాయింట్‌ 5 బిలియన్‌ డాలర్లల ఫండింగ్‌ గ్యాప్‌ నెలకొంది. దీంతో.. హెల్త్‌ అండ్‌ అగ్రికల్చర్‌.. ఈ రెండు సెక్టార్లకు కలిపి ఏటా 140 బిలియన్‌ డాలర్లకు పైగా నిధుల కొరత వేధిస్తోంది. బిల్‌గేట్స్‌ ఇచ్చేది మాత్రం 7 బిలియన్‌ డాలర్లే. దీన్నిబట్టి ఆఫ్రికా ఖండానికి ఇంకెంత డబ్బు కావాలో అర్థంచేసుకోవచ్చు.