NTV Telugu Site icon

VH: రేవంత్‌-కోమటిరెడ్డి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు.. అదేం గొప్ప..?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు.. కొన్ని సందర్భాల్లో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నా.. వారి మధ్య మనస్పర్దలు కొనసాగుతూనే ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నమాటలు.. అయితే, తాజాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రేవంత్, కోమటిరెడ్డి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఇద్దరూ రెడ్లు కలిశారు.. ఇద్దరు రెడ్లు కలవడం గొప్ప కాదన్న ఆయన.. వాళ్లు అందరూ చుట్టాలే అని వ్యాఖ్యానించారు.

Read Also: Undavalli : ఏపీని కలుపుకుపోండి.. బీజేపీని నిలదీయండి కేసీఆర్..!

మరోవైపు.. సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే రోజు టి. కాంగ్రెస్‌ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు వీహెచ్.. బర్త్ డే రోజు శాపనార్థాలు పెట్టడం సరికాదని హితవుపలికారు.. శాపనార్థాలు ఆడవాళ్లు పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. మనం శాపాలు పెట్టొద్దు అని నా ఉద్దేశం అన్నారు.. ఇక, వచ్చే బడ్జెట్లో స్పోర్ట్స్ కి నిధులు ఎక్కువ కేటాయించాలని డిమాండ్‌ చేశారు వీహెచ్.. కొత్త జిల్లాల్లో స్టేడియాలు ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన.. డ్రగ్స్ పోవాలి అంటే.. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలన్నారు.