దేశంలో బీజేపీ కి ఎన్నికలు తప్ప .. కరోనా ఇబ్బందులు పట్టడం లేదు అని మాజీ ఎంపి వి.హనుమంతరావు అన్నారు. కరోనా ఇబ్బందులు ఉన్నాయని ఎన్నికల రోడ్ షో లు రద్దు చేసుకున్నాడు రాహుల్ గాంధీ. ఈ సమయంలో కుంభమేలా పెట్టాల్సిన అవసరం ఉందా.. దాంతో ఎంతమందికి కరోనా వచ్చింది. కుంభమేళా పెట్టినందుకు మోడీ,సీఎం యోగి ఆదిత్యనాథ్ పై యాక్షన్ తీసుకోవాలి అని అన్నారు. చీఫ్ జస్టిస్ దీనిపై స్పందించాలి .. మోడీ,యోగి పై చర్యలు తీసుకోవాలి అని కోరారు. అయితే మోడీ,అమిత్ షా లకు అధికార అహం ఎక్కువైంది అని చెప్పిన ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు 6 వేలు ఇవ్వాలి అని పేర్కొన్నారు.