ఈరోజు ఐపీఎల్ 2021 లో కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో పంజాబ్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా కేకేఆర్ మాత్రం కేవలం మొదటి మ్యాచ్ లో విజయం సాధించగా తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది.అయితే గత మ్యాచ్ లో ముంబై పై విజయం సాధించిన పంజాబ్ బౌలింగ్ లో బలంగా కనిపిస్తుంటే కోల్‌కత మాత్రం ప్రత్యర్థులను భారీగా పరుగులు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత భారీ లక్ష్యం ముందు బోర్లా పడుతుంది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే 4వ స్థానికి చేరుకుంటుంది. ఒకవేళ ఈరోజు కోల్‌కతను విజయం పలకరిస్తే చివరి స్థానంలో ఉన్న ఆ జట్టు 6వ స్థానానికి వచ్చేస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.