సీఎం ప్రకటనకు అనుగుణంగా పిఆర్సీ జిఓలు విడుదల : ఐక్య వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన సవరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతేకాకుండా మే 1వ తేదీన పొందే ఏప్రిల్ నెల వేతనాలు నూతన పిఆర్సీ ప్రకారమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పొందుతారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెల ముగింపుకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కాలేదు సరి కదా, ఇంతవరకు కూడా పిఆర్సీ పై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాలేదు. 1.07.2018 నుండి అమలు కావలసిన వేతనాల సవరణ ముప్పై మూడు నెలలు ఆలస్యం అయింది. మధ్యంతర భృతి కూడా ఇవ్వలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా కనీసం పిఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు అయినా సకాలంలో వస్తాయని ఆశించిన వేతన జీవులకు నిరాశే ఎదురైంది. పిఆర్సీ సిఫారసులు మరియు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ప్రకటనలకు అనుగుణంగా వెంటనే (పిఆర్సీ) నూతన వేతనాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు(జిఓలు) వెంటనే విడుదల చేసి మే నెల నుండి నూతన వేతనాలు పొందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంటాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ పక్షాన మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వినతిపత్రం ఇ మెయిల్ ద్వారా అందజేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంటాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక కమిటీ సభ్యులు.
Also Read
తాజావార్తలు
-
Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
-
Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
-
Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
-
Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?