ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ పేషెంట్లకే అని తెలిపారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కు నోడల్ అధికారులు నియామకం చేసినట్లు చెప్పిన ఆయన ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై రోజూ నివేదికలు ఇవ్వాలని నోడల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారి సమాచారం కోసం హాస్పిటల్స్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసారు. అయితే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే హాస్పిటల్స్ పై చర్యలు తప్పవు అని హెచ్చరించిన ఆయన చిన్న అనారోగ్యం వచ్చిన ప్రజలు టెస్టులు చేయించుకోవాలి అని తెలిపారు. జిల్లాలో 1750 బెడ్స్ సిద్ధం చేశాం. ఇప్పటివరకూ 1100 బెడ్స్ లో పేషెంట్లు ఉన్నారు. జిల్లాలో బెడ్స్ కొరత లేదు.. మరిన్ని బెడ్స్ ను పెంచుతున్నాం.. కోవిడ్ కేర్ సెంటర్లలో మంచి చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు. అలాగే అనవసరంగా హాస్పిటల్స్ లో చేరకండి అని అన్నారు.