Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Kcr Speech At Nagarjuna Sagar

బీజేపీ ని ఒక్క మాట కూడా అనని కేసీఆర్…

Published Date :April 16, 2021 , 9:38 pm
By Manohar
బీజేపీ ని ఒక్క మాట కూడా అనని కేసీఆర్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ కేవలం కాంగ్రెస్ పార్టీనే  టార్గెట్ చేశారు. బీజేపీని కౌంటర్‌ చేయలేదు. YS షర్మిల విమర్శలకు బదులివ్వలేదు. ఆ ఇద్దరినీ కేసీఆర్‌ ఎందుకు వదిలేశారు? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?  

కేసీఆర్‌ సభలో జానారెడ్డిపైనే విమర్శలు!

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. నాగార్జునసాగర్‌లో జరుగుతున్న ఉపఎన్నికే దీనికి కారణం. ఈ బైఎలక్షన్‌కు ముందు రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, నేతల విమర్శలు మరింత ఆజ్యం పోశాయి. ప్రచారం గడువు ముగియడానికి ఒక్కరోజు ముందు గులాబీ బాస్‌ కేసీఆర్ బహిరంగ సభ పెట్టడంతో చాలా విమర్శలకు ఆయన నుంచి కౌంటర్లు వస్తాయని అనుకున్నారు. కానీ.. అందరి అంచనాలను కాదని.. సభలో కేవలం కాంగ్రెస్‌ పార్టీని, జానారెడ్డిని కార్నర్‌ చేశారు. చివరకు వరకు అదే ఒరవడి కొనసాగింది. 

సాగర్‌లో బీజేపీని ప్రత్యర్థిగా భావించలేదా? 

కాంగ్రెస్‌తోపాటు బీజేపీని కూడా తనదైన శైలిలో కేసీఆర్‌ మాటలతో ఆడుకుంటారని అంతా అనుకున్నారు. అలాగే కొత్తగా వస్తున్న YS షర్మిల పార్టీ గురించి కామెంట్‌ చేస్తారని భావించారు విశ్లేషకులు. కానీ.. బీజేపీ, షర్మిల పార్టీల గురించి ఒక్క మాట మాట్లాడలేదు గులాబీ దళపతి. గతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీని సీఎం కేసీఆర్‌ టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సభలో మాత్రం బీజేపీ ఊసే లేదు.  సాగర్‌లో బీజేపీని ప్రత్యర్థిగా  టీఆర్‌ఎస్‌ భావించడం లేదట. అందుకే జానారెడ్డిని ఎక్కువగా టార్గెట్‌ చేసినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల వాదన. బీజేపీ గురించి మాట్లాడి ఆ పార్టీకి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచించినట్టు తెలుస్తోంది. 

ఎన్నికల సభలో షర్మిల విమర్శలకు కౌంటర్లు లేవు!

తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నాని ప్రకటించారు వైయస్ షర్మిల. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సాగర్ సభలో ఆ విమర్శలపై కేసీఆర్‌ రియాక్ట్ అవుతారని అనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిలపై మాట్లాడం అవసరం లేదని టీఆర్‌ఎస్‌ భావించిందట. ప్రస్తుతం షర్మిల పార్టీ విషయంలో వేచి చూసే ధోరణిలో టీఆర్‌ఎస్‌ ఉంది. ఒకరిద్దరు టీఆర్ఎస్ నేతలు మాత్రమే రియాక్ట్‌ అయ్యారు. ఆమె గురించి మాట్లాడటానికి అది సరైన వేదిక కాదని భావించే సభలో కేసీఆర్‌ ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. 

మొత్తానికి ఎన్నికల సభలో ఆ ఇద్దరినీ కేసీఆర్‌ వదిలేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరికి వారుగా విశ్లేషణలు చేస్తున్నారు. 

IFrame

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kcr
  • nagarjuna sagar

తాజావార్తలు

  • Varanasi : జక్కన్నకు తలనొప్పిగా మారిన లీక్స్.. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వారణాసి వీడియో

  • Multigrain Flour: మల్టీగ్రెయిన్ పిండితో పొరపాటున కూడా ఇవి కలపొద్దు.. ఆరోగ్యానికి ముప్పు!.. ఏంటి అవి..?

  • Kollywood : కోలీవుడ్‌లో ఖాళీగా ఉన్న టాప్ చెయిర్.. రజనీ, విజయ్, అజిత్ తర్వాత ఆ వారసుడు ఎవరు?

  • Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు!

  • Vaibhav Sooryavanshi: వైభవ్‌కు బంపర్ ఆఫర్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. సచిన్ రికార్డుకు ఎసరు!!

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions