NTV Telugu Site icon

చంద్రబాబుకు ఉగ్రవాదుల లక్షణాలన్నాయి…

చంద్రబాబు , టీడీపీ నేతల పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు.  రాష్ట్రంలో ఒకరకమైన దుష్ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు , లోకేష్ & బ్యాచ్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలు తెలుగు ప్రజలను రానివ్వడం లేదు. దీనికి ఎల్లో వైరస్ కారణం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబు లాగా నీచరాజకీయాలు మరెవరూ చేయలేరు. అసలు చంద్రబాబు ప్రజల వైపా…వైరస్ వైపా అని అన్నారు. చంద్రబాబుకు ఉగ్రవాదులకు ఉండే లక్షణాలన్నా ఉన్నాయి. చంద్రబాబు ఒక రాజకీయ ఉగ్రవాది. ఎన్ 440 వైరస్ విషయంలో నా పై దృష్ప్రచారం జరుగుతోంది. నేను ఒక ఛానల్ డిబేట్ లో చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఎన్ 440 వైరస్ పై ఎవరైనా డిబేట్ కు రావాలని సవాల్ విసురుతున్నా… దమ్ముంటే ఎవరైనా నాతో డిబేట్ కు రావాలి అన్నారు. వ్యాక్సిన్ ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పడానికి సిగ్గులేదా… వ్యాక్సిన్ కోసం ఇళ్లలో కూర్చుని దీక్షలు చేస్తున్న వారికి ఇంగితజ్ఞానం ఉందా. అచ్చెన్నాయుడికి చేతనైతే చంద్రబాబుకు చెప్పండి. భారత్ బయోటెక్ తో మాట్లాడి వ్యాక్సిన్ పంపిణీ చేయమని చెప్పమని సలహా ఇవ్వండి. ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దు. కోవిడ్ హాస్పిటల్స్ లో సిబ్బంది కొరత లేదు అని తెలిపారు మంత్రి.