కేటీఆర్ సీఎం పదవికి అడ్డంకిగా ఈటల… అందుకే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటల పేరు ముఖ్యమంత్రి గా టిఆర్ఎస్ లో తెర మీదకు రావడం జరిగింది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా ఈటల మారారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడనికి గండి పడ్డట్లు అయింది. అందుకే మెదక్ జిల్లా లో భూ కుంభకోణంలో ఈటల పెరు తెర మీద కు వచ్చింది. అసైన్డ్ భూములు కొనడానికి అమ్మడానికి వీలు ఉండదు. పట్టభూముల పక్కకి అసైన్డ్ భూములు ఉంటే అసైన్డ్ భూములను మార్కెట్ రేట్ ప్రకారం కొనవచ్చు. ఈటల రాజేందర్ గతంలో ఇదే అంశాన్ని కేసీఆర్ కు,సీఎం ఓ అధికారి నర్సింగ్ రావు కు చెప్పినట్లు ఈటల చెప్పారు. ఈటల అసైన్డ్ భూములను న్యాయ బద్ధంగా కొనుగోలు చేశారని చెప్పుతున్నారు. గతంలో కేసీఆర్ ఆస్తులు ఎంత ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు ఎంత. కేటీఆర్ 111 జీవో ను ఉల్లఘించి జాన్వడలో భూమి ని అక్రమించుకుంటే విచారణ లేదు. మల్లారెడ్డి,ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి పైన విచారణ లేదు చర్యలు లేవు.
నిఖార్సయిన తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమ తొలినాళ్ళ నుండి ఈటల,హరీష్ అండగా నిలిచారు. మిగతా వాళ్ళందరూ బిటి బ్యాచ్. కొడుకు,బిడ్డ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. 2004 లో కేసీఆర్ మంత్రి పదవి చెప్పటక కేటీఆర్,కవిత తెలంగాణ కు దిగుమతి అయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే… కరోనా సమయంలో ఈటలా పని చేస్తున్నారు. విచారణ అధికారులు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందిచాలి కానీ మీడియా కు నివేదిక ఇస్తున్నారు. కలెక్టర్ ఒక్క నిర్ణయనికి వచ్చాక ప్రభుత్వం ఎందుకు. రిటైర్ కలెక్టర్ ధర్మారెడ్డి భూములను ఈటల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చారు అన్నారు. మరి అప్పుడు ధర్మ రెడ్డి ఏమి చేశారు. ధర్మారెడ్డి పైన ఏసీబీ కేసులు ఉన్నాయి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర బలవంతంగా కేసీఆర్ భూములను తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ పెద్ద బావి తవ్వితే చుట్టు పక్కల బావిలు ఎండిపోయాయి. ధరణి వెబ్ సైట్ కేసీఆర్ పేరు మీద ఎర్రవెల్లి లో భూములు లేనట్లుగా చూపిస్తున్నాయి. ఎందుకు కేసీఆర్ భూముల దాపరికం. కేసీఆర్ కుటుంబం గతంలో ఆస్తులు ఎంత?ఇప్పుడు ఎంత బహిరంగ విచారణకు రావాలి. మంత్రి మల్లారెడ్డి బెదిరింపు వాయిస్ మీద ఎందుకు విచారణ జర్పించడం లేదు. ఈటల రాజేందర్ పదవి కోసం వేంపర్లుఆడే వ్యక్తి కాదు. అందుకే ఆయన పై ఆరోపణలు బయటకు వచ్చాయి అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
-
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
ట్రెండింగ్
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!