తమిళనాడులో సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు.. మొత్తం 34మంత్రులతో స్టాలిన్ కేబినెట్ ఏర్పడింది.. ఇందులో ఐదుగురు తెలుగు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించాయి.. తమిళ కేబినెట్ లో ప్రతిసారి తెలుగు మంత్రులు స్థానం పొందుతూనే ఉన్నారు.. సీఎం జయలలిత అయినా కరుణానిధి అయినా పన్నీర్ సెల్వం , పాలనిస్వామి ఇలా ఎవరు సీఎం ఉన్నా తెలుగువారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు..తమిళనాడులో చెన్నై తో పాటు కోయంబత్తూరు, మదురైలో ఇప్పటికీ లక్షల్లో తెలుగువారు స్థిరపడ్డారు.. కొన్ని నియోజకవర్గాల్లో అయితే తెలుగువారే శాసిస్తారు.. అందుకే అన్ని పార్టీలు ఆ నియోజకవర్గాల్లో తెలుగువారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారు..తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 15మంది తెలుగువారు వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు.. అందులో ఐదుగురికి స్టాలిన్ మంత్రిపదవులు ఇచ్చారు..వారిలో
కె కె ఎస్ ఎస్ రామచంద్రన్ – అరుప్పుకొట్టై నియోజకవర్గం ఎమ్మెల్యే .
రెవిన్యూ శాఖ మంత్రి .
ఏ వ వేలు – తిరువణ్ణామలై నియోజకవర్గం.
పీడబ్లుడి శాఖ మంత్రి .
ఆర్ గాంధీ – రాణిపేట నియోజకవర్గం పీడబ్ల్యుడి
టెక్స్టైల్ శాఖ మంత్రి .
కె ఎన్ నెహ్రు – తిరుచ్చి వెస్ట్
మున్సిపల్ శాఖ మంత్రి
పీ కె శేఖర్ బాబు – చెన్నై దురై ముగం .
దేవాదాయ శాఖ మంత్రి …ఉన్నారు..
గత పలని స్వామి కేబినెట్ లోనూ కదంబురు రాజు, బాలకృష్ణారెడ్డి లాంటి తెలుగువారు పదేళ్ళపాటు మంత్రులుగా పని చేశారు..