ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం… ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక వైపు కరోనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాలతో వరుస వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు వెలువరించింది. వివిధ పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలలపై ఆంక్షలు అమలుచేస్తోంది.
రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగించే అంశం పై నేడు నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ఎన్నికల సంఘం.కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు, ఎన్నికలు జరగనున్న 5 రాష్టాల ఉన్నతాధికారులు, 5 రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి రానుంది కేంద్ర ఎన్నికల సంఘం.
Also Read
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8 న ప్రకటిస్తూ, ఎన్నికల ప్రచార సభలను, రోడ్ షో లను, ఇతర ఎన్నికల ప్రచారాలను జనవరి 15 వ తేదీ వరకు నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత, మరలా జనవరి 22 వ తేదీ వరకూ నిషేధాన్ని పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఈ రోజు మరోసారి సమీక్షించి నిషేధం కొనసాగించాలా, లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే రాజకీయ పార్టీలు ఇండోర్ సమావేశాలు నిర్వహించుకునేందుకు మాత్రం అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏదైనా సమావేశ మందిరంలో 300 మంది వరకు హాజరయ్యేందుకు, లేదా సమావేశ మందిరం సామర్ధ్యం లో 50 శాతం వరకు సమావేశమయ్యేందుకు అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!