రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో సందీప్ రాజ్ ఫిలిమ్స్, వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్రజీత’. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియాలోని డాండెనాంగ్ సిటీలోని శివవిష్ణు ఆలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ “‘అగ్రజీత’ ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణానంతరం ఆ జ్ఞాపకాలు అణువు ద్వారా మరో జీవిలోకి వెళ్లే ఒక శాస్త్రీయమైన కథ. ఆకట్టుకునే గ్రాఫిక్ వర్క్ కూ ఇందులో ఆస్కారం ఉంది. సినిమా మొత్తం షూటింగ్ ఆస్ట్రేలియాలోనే చిత్రీకరిస్తాం” అని తెలిపారు.