పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని సరిగా లేదని… అయన్ను వెంటనే మార్చాల్సిందేనని సిద్ధూ వర్గం నేతలు పట్టుబట్టారు. అవసరం అయితే, సోనియా గాంధీని కలుస్తామని ప్రకటించారు. ఇంతలోనే పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు హరీష్‌రావత్… అసంతృప్తవర్గానికి చెందిన నలుగురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు… రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వివరించారని హరీష్ రావత్ తెలిపారు. తిరుగుబావుట ఎగురవేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వ్యతిరేకంగా కాదని చెప్పారు. పటిష్టమైన ప్రణాళికతోనే ఎన్నికలకు వెళ్లాలన్నదే…సిద్ధూ వర్గం నేతల ఆకాంక్ష అని వెల్లడించారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని హరీశ్ రావత్ ప్రకటించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు హరీశ్ రావత్ ప్రకటించడంతో…అసంతృప్తి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్న దానిపై ఆసక్తిగా మారింది.
Also Read
తాజావార్తలు
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!