Samantha: చైతన్య తో ‘మజిలీ’.. విడాకుల తరువాత షేర్ చేసిన సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్యతో సమంత గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక విడాకుల తరువాత ఎవరి దారి వారు చూసుకున్న ఈ జంట కెరీర్ మీదనే ఫోకస్ పుట్టిన సంగతి తెల్సిందే. చైతూ వరుస సినిమాలతో బిజీగా మారగా.. సామ్ సైతం ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారింది. ఇక విడాకుల తరువాత చైతూ జ్ఞాపకాలను తుడిచేస్తున్న సామ్ మొట్టమొదటిసారి చైతూ ఫోటోను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఉన్న చైతు ఫోటలను డిలీట్ చేసిన సామ్ నేడు చైతూ ఫోటోను ఇన్‌స్టా స్టోరీగా పెట్టింది. అయితే దినుకు కారణం కూడా లేకపోలేదు. ఈ జంట కలిసి నటించిన మజిలీ చిత్రం నేటితో మూడేళ్లు పూర్తిచేసుకుంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరుస ప్లాపుల్లో ఉన్న చైతూ కు భారీ విజయాన్ని అందించింది. సామ్ కి మంచి పేరును తీసుకురావడమే కాకుండా అవార్డులను కూడా తీసుకొచ్చిపెట్టింది. ఇక మజిలీ తరువాత ఈ జంట పూర్తిగా కలిసి నటించింది లేదు. దీంతో ఈ సినిమా అంటే ప్రేక్షకులకు ప్రేమ అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని సామ్ గుర్తుచేసింది. మజిలీ పోస్టర్ ని షేర్ చేస్తూ మజిలీకి మూడేళ్లు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే మజిలీ లో అన్ని పోస్టర్ లు ఉండగా.. చైతూ ఒక్కడే ఉన్న పోస్టర్ ని పెట్టడంపై ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ చైతూతో మజిలీ మొదలుపెట్టాలనుకుంటుందా..? ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!