ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి బన్నీ అభిమానుల్లో జోష్ ను పెంచే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ చిత్రంలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. దీంతో అప్పడే ఈ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రంలో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది. ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తుండడం విశేషం. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ రేంజ్ లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.