Site icon NTV Telugu

Raashii Khanna: ‘బెల్లం శ్రీదేవి’కి వరుస ఫ్లాపులు.. టాలీవుడ్‌లో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

Raashii Khanna

Raashii Khanna

టాలీవుడ్‌లో ఆరేళ్లుగా రాశీ ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్‌లో చేసిన వెబ్‌ సిరీస్‌లు ఓకే అనిపించినా.. మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధ, ద సబర్మతి రిపోర్ట్, 120 బహుదూర్ డిజాస్టర్లుగా నిలిచాయి. కోలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి.. తమిళ తంబీలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి ఆరణ్మనై 4 ద్వారా హిట్‌ అందుకుంది రాశీ.

గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస ఫెయిల్యూర్స్ రాశీ ఖన్నా ఇమేజ్‌ను కాస్త డ్యామేజ్ చేశాయి. ఈ ఏడాదేతై హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు. నార్త్ టూ సౌత్ సినిమాలు చేసినా ఒక్క హిట్ దక్కలేదు. తమిళంలో అగత్యా, తెలుగులో తెలుసు కదా, హిందీలో చేసిన 120 బహుదూర్ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. అయినా సరే రాశీకి మరో ఛాన్స్ ఇస్తున్నాయి ఈ త్రీ ఇండస్ట్రీస్. బాలీవుడ్‌లో ఒక్క హిట్ లేకపోయినా రాశీ ఆఫర్లకొచ్చిన ఢోకా లేదు. ప్రస్తుతం ఫర్జీ2 వెబ్‌ సిరీస్‌తో పాటు తలాఖో మే ఏక్, బ్రిడ్జ్ ఫిల్మ్స్‌ చేస్తున్నారు. తమిళంలో సిద్దార్థ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రౌడీ అండ్ కో’లో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.

Also Read: Catherine Tresa: మరోసారి ఐటమ్ భామగా ఎమ్మెల్యే మేడమ్‌.. ఇప్పుడైనా కలిసొచ్చేనా?

ఇక రాశీ ఖన్నా తెలుగులో చేస్తోన్న ఏకైక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్లోకగా కనిపించబోతున్నారు. ఇందులో శ్రీలీల మెయిన్ లీడ్ కాగా.. రాశీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటి వరకు మెగా హీరోలతో నటించిన రాశీ ప్రతి సినిమా సక్సెస్‌ అయింది. సుప్రీమ్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండగే హిట్స్‌గా నిలిచాయి. నెక్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ పడితే.. ఈ సెంటిమెంట్ నిజమైనట్లే. ఈ విషయం తేలాలంటే నెక్ట్స్ సమ్మర్ వరకు ఆగాల్సిందే.

Exit mobile version