ఈ మధ్య కాలంలో పాములతో సాహాసాలు చేస్తూ రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పాములు స్వీయ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి. అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో ఎవరూ చెప్పలేరు. కానీ, అలాంటి పాములతో కొందరు పరాచకాలు ఆడుతుంటారు. విషపూరిత పాములు, కింగ్ కోబ్రా లాంటి వాటితో కొందరు పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు విషపూరిత పాములను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిలో కొందరు ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి..
తాజాగా ఓ యువతి కూడా భారీ పామును ముద్దు పెట్టుకొనే ప్రయత్నం చేసింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ యువతి పామును ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించింది. సాధారణంగా ఎవరైనా పామును చూస్తే హడలిపోతారు. ఆ పాముకు దూరంగా పరిగెడతారు.. కానీ ఈ వీడియోలో ఉన్న యువతి మాత్రం అలా కాదు. అదేదో పామును ముద్దుపెట్టుకుంటానంటూ పందెం వేసుకున్నట్టుగా చుట్టూ జనాలు చూస్తుంటే పామును ముద్దును పెట్టుకునే ప్రయత్నం చేసింది. అక్కడ ఏదో మ్యూజిక్ టీం ఉన్నట్టుగా వీడియో చూస్తే అర్థం అవుతుంది. అక్కడే ఓ యువతి భారీ సైజున్న ఓ పాము తోక పట్టుకుని ఉంది..
మరో యువతి తన చేతి గుడ్డతో పామును రెచ్చ గొట్టే ప్రయత్నం చేసింది. అంతేకాదు కోపంతో ఉన్న నాగుపాము తలను ముద్దుపెట్టుకున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ యువతి వేదికపై నిర్భయంగా పాము తలకి ముద్దు ఇస్తున్న వీడియో చూస్తే ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె ఎదురుగా ఉన్న మరో మహిళ పాము తోకను గట్టిగా పట్టుకుని ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ వీడియో పాతదే అయిన ఇప్పటికి వైరల్ అవుతుండటం విశేషం..