మనుషులకు మనుషులు సహాయం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరి స్వార్ధం వారిది. ఒక మనిషి బతికున్న సమయంలోనే ఆదుకోనివారు మరణించిన తరువాత వస్తారా చెప్పండి. మనుషులకే దిక్కులేప్పుడు ఇక పశువులు మరణిస్తే వస్తారా… ఎవరి బిజీ వారిది. అయితే, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఓ ఎద్దు మరణిస్తే ఆ గ్రామం మొత్తం కదిలి వచ్చింది. ఒక మహా మనిషి మరణిస్తే ఎలాగైతే పుణ్యకార్యాలు నిర్వహిస్తారో ఆవిధంగానే ఆ ఎద్దుకు చేయాల్సిన పుణ్యకార్యాలు అన్ని నిర్వహించారు. ఖననం చేశారు. ఆ తరువాత గ్రామంలోని 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. చనిపోయి ఆ ఎద్దుకు ఎందుకని అంత వైభోగంగా పుణ్యకార్యాలు నిర్వహించారు అనే సందేహం రావొచ్చు. ఎందుకో తెలుసుకుందాం. శహరాన్‌పూర్‌లోని కుర్దీ అనే గ్రామంతో ఆ ఎద్దు 20 ఏళ్లుగా ఉంటోంది. గ్రామంలో ఎవర్నీ ఎమీ అనేది కాదు. చిన్నపిల్లలు కూడా ఆ ఎద్దుతో సరదాగా ఆడుకునేవారు. అందరితో కలిసిమెలిసి వారిలో ఒకటిగా జీవించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగాని ఆ గ్రామంలోని ఓ పవిత్రమైన ప్రాంతంలో సడెన్ గా ఒకరోజు ఆ ఎద్దు కనిపించిందట. అప్పటి నుంచి ఆ గ్రామంలోనే ఉండిపోయింది. దానిని శివుని వాహనమైన నంధీశ్వరుడి అవతారంగా భావించి గ్రామంలోని ప్రజలు దానికి పూజలు చేసేవారు. ఎవరు ఏం చేసినా ఏమీ అనేది కాదట. అందుకే ఆ ఎద్దు అంటే ఆ గ్రామంలోని వారికి అంతటి మమకారం. సడెన్‌గా చనిపోయిన ఎద్దు పుణ్యకార్యాల కోసం గ్రామంలోని ప్రజలంతా చందాలు వేసుకొని పుణ్యకార్యాలు నిర్వహించారు.
Read: ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్… గంటకు…