టాలివుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..వీరిద్దరూ రిలేషన్ ఉన్నారంటు వార్త వినిపిస్తుంది..మేమిద్దరం ఫ్రెండ్స్ అని వీళ్ళు చెప్పినా కూడా వీరు తరచు కలుస్తుండటం తో జనాలు అదే నిజమే అనుకుంటున్నారు.. తాజాగా మరోసారి వీరిద్దరూ ఓ కేఫ్ లో కలుసుకున్నారని ఓ ఫోటో నెట్టింట షికారు చేస్తుంది..
విజయ్ దేవరకొండ, రష్మిక తరచుగా కలిసి తిరుగుతూ ఉంటారు. స్నేహితులతో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి గేదర్ అవుతుంటారు. కలిసి విహారయాత్రలు చేయడం.. ఎయిర్ పోర్టులలో కనిపించడం అందరికీ తెలిసిందే. మేము మంచి స్నేహితులము మాత్రమే అని వారు చెప్పుకున్నప్పటికీ ఇద్దరు కలిసినప్పుడల్లా పెద్ద వార్త అవుతోంది. తాజాగా ఈ జంట ఒక కేఫ్‌లో కనపడటంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? అంటూ మళ్లీ చర్చ మొదలైంది. కేఫ్‌లో వీరితో పాటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, ఆనంద్ దేవరకొండ, పెరియా వర్మలు కూడా ఉన్నారని ఆ పోస్ట్ కనిపిస్తుంది..
రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాల్లో నటించారు.. ఇక విజయ్, రష్మికల ఆన్ స్క్రీన్ రొమాన్స్ వల్లే వారిద్దరూ కలిసిన ప్రతిసారి రూమర్స్ పుట్టుకోస్తున్నాయి.. అందుకే వీరి ఫ్యాన్స్ కూడా అదే నిజమని నమ్ముతున్నారు.. ఇటీవల కాలంలో చాలా మంది జంటలు మా ఇద్దరి మద్య ఏం లేదంటూనే పెళ్లి పీటలవరకు తీసుకెళ్లారు.. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. వీరిలాగే ఎప్పుడో సడెన్‌గా విజయ్ దేవరకొండ, రష్మిక అనౌన్స్‌మెంట్ చేసినా ఆశ్చర్యం లేదంటూ జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.. ప్రస్తుతం పుష్ప2 లో నటిస్తుంది..