తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల సైందవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు.. ఇదిలా ఉండగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి నిన్న రామానాయుడు స్టూడియోలో జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడ కు చెందిన ఓ డాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు.. కానీ ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేశారు.. హీరోల ఇంట పెళ్లి అంటే హాడావిడి మాములుగా ఉండదు.. కానీ వెంకటేష్ ఎందుకు సింపుల్ గా చేశారో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు..
హయవాహిని పెళ్లి మార్చి 15న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు మాత్రమే హాజరైయారు.. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే , వెంకటేష్,నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..